29.7 C
Hyderabad
May 4, 2024 04: 41 AM
Slider నిజామాబాద్

బిచ్కుందలో ఆర్డీవో పర్యటన

RDO Bichkunda

పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ పలు మండలాలపై బుధ‌వారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలో జరిగిన సమీక్షలో పాల్గొన్నఆయనకు పలువురు మంజీరా నదిలో అక్రమంగా వే-బిల్లులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని సమాచారమివ్వడంతో స్పందించిన ఆయన బాన్స్‌వాడ ఆర్డీఓ రాజాగౌడ్ కు క్వారీలను పరిశీలించాల్సిందిగా ఆదేశించడంతో ఆర్డీవో బిచ్కుంద మండలంలోని ఖత్గావ్, మద్నురు మండలంలోని కుర్లా గ్రామాలలో కొనసాగుతున్నఇసుక క్వారీ పాయింట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వే బిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టంగా హెచ్చరించారు. అనంతరం బిచ్కుంద తహసీల్దార్ కార్యాలయాన్నిసందర్శించి రికార్డులను పరిశీలించిన ఆయన ధరణి పోర్టల్ తదితర విషయాలపై తహసీల్దార్ వెంకట్రావును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తహసీల్దార్లతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా అధికారులు సిబ్బంది ఉన్నారు.

Related posts

లక్ష్యాలను నిర్దేశిత సమయంలో సాధించాలి

Bhavani

హరిత సిక్కోల్ జిల్లా ఏర్పాటు వాకర్స్ లక్ష్యం

Satyam NEWS

Analysis: రైతు ఉద్యమం ముగిసేనా?

Sub Editor

Leave a Comment