37.2 C
Hyderabad
May 6, 2024 13: 45 PM
Slider నిజామాబాద్

ఘనంగా ఎన్.ఎస్.యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

#nsui

ఎన్.ఎస్.యూఐ 54 వ ఆవిర్భావ వేడుకలను జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని డెయిరీ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును రూపొందించండంలో విద్యార్థుల పాత్ర ముఖ్యమన్నారు. 1971లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో ఎన్.ఎస్.యూఐ ఏర్పడిందని, తదనంతరం విద్యారంగ సమస్యల పరిష్కారం దిశగా పోరాటం చేసిందన్నారు. ఇందులో పని చేసిన చాలా మంది నాయకులు జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. విద్యా, ఉద్యోగ హక్కులను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కోరారు. విద్యార్థుల సంక్షేమం హక్కుల కోసం  ఎన్.ఎస్.యూఐ నిరంతరం పోరాడుతుందని, రాహుల్‌ గాంధీని  దేశ ప్రధానిని చేయడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ సైనికులుగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యూఐ జిల్లా కార్యదర్శి భరత్ టింకు, నాయకులు రాహుల్, సోఫియాన్, ఆకాష్, అలీం, ఫనీంద్ర, అభిలాష్, యశ్వంత్, ఆనంద్, సాయినాథ్, రాఖీ, మనోహర్, దినేష్, విష్ణు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

బాబ్రీ విధ్వంసం కేసును కొట్టేసిన లక్నో సీబీఐ కోర్టు

Satyam NEWS

గాంధీభవన్ ను ముట్టడించిన భజరంగ్ దళ్

Satyam NEWS

ఖమ్మం ప్రజల అకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా

Satyam NEWS

Leave a Comment