37.2 C
Hyderabad
April 26, 2024 19: 59 PM
Slider శ్రీకాకుళం

హరిత సిక్కోల్ జిల్లా ఏర్పాటు వాకర్స్ లక్ష్యం

#Walkers Club

పర్యావరణ పరిరక్షణ లో భాగంగా హరిత సిక్కోలుజిల్లా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు  సంపూర్ణ మద్దతు ప్రకటించాయని విజ్ఞాన భారతి వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ ఆర్.డి.ఓ.పి.ఎం.జె.బాబు అన్నారు.

గురువారం శ్రీకాకుళం నగరంలో సత్యసాయినగర్ లో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటుటకు వర్షాకాలం అనుకూలంగా ఉంటుందని  ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించాలని కోరారు. ప్రకృతి వికాసానికి ,స్వచ్ఛమైన వాతావరణం ఏర్పాటు కు మొక్కలు నాటడం వాటి సంరక్షణ చేపట్టాలని కోరారు.

కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు మొక్కలు పెద్దఎత్తున పెంపకం చేపడు తున్నాయని, ప్రభుత్వాలతో పాటు స్వంచంద సంస్థలు…ప్రజాసంఘాలు…వాకర్స్ ఇంటర్నేషనల్  సంస్థలు అన్నీ కలిసికట్టుగా ముందుకు వచ్చి హరితహారం స్థాపన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా పి.ఎం.జె.బాబు వితరణతో వాకర్స్ పార్క్ లో ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచీలు ప్రారంభించారు.. విజ్ఞానభారతి వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అన్నెపు పున్నయ్య, అన్నెపు ఈశ్వరరావు, U. పవన్ కుమార్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శాసపు జోగినాయుడు, ఎం.మల్లిబాబు, గురు ఆనందరావు పాల్గొన్నారు.

ఇంకా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ గంజి ఎజ్రా సత్యసాయి నగర్ కాలనీ ప్రతినిధులు వెంకటరాజు, ధర్మారావు, వాసుదేవరావు, జగన్నాధం, కృష్ణమూర్తి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. అంతకముందు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ఆధ్వర్యంలో రిటైర్డ్  ఆర్.డి.ఓ.పి.ఎం.జె.బాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు… స్వీట్స్ పంపిణీ చేశారు. సత్యసాయి నగర్, షిర్డీ సాయి నగర్ కాలనీ వాసులు అంతా వాకర్స్ ట్రాక్, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.

Related posts

సంచైత నియామకం చట్టరీత్యా వ్యతిరేకం

Sub Editor

తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Bhavani

నాగర్ కర్నూల్ జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్

Satyam NEWS

Leave a Comment