26.7 C
Hyderabad
May 16, 2024 07: 55 AM
కవి ప్రపంచం

సత్తాగల్గిన సౌమ్యశీలి

#Sandhya Sutravey

రైతుబిడ్డగా పల్లెటూర్లో పుట్టి

చదవులకై బస్తీకి ప్రయాణించి

ఉస్మానియా ఒడిలో, బొంబాయి

విశ్వవిద్యాలయంలో చదువును సాగించి

లోకం తీరును అర్థం చేసుకొని

ప్రజాసమస్యల అవగాహనతో

పలు ఉద్యమాల్లో పాల్గొని

ప్రజలమనిషిగా,న్యాయవాదిగా ఎదిగి

రాజకీయాలవైపు మొగ్గి, పోటిలో నెగ్గి

రాష్ర్ట,కేంద్ర శాసనసభ సభ్యునిగా

అనేక శాఖలకు మంత్రిగా సత్తా

చాటి, తన దైన శైలిలో పాలన సాగించి

గొప్పఉపన్యాసకుడిగా, కవి, రచయితగా

బహుభాషావేత్త గా పేరొంది

సహస్రఫణ్ అనువాదం గావించి

తన ఆత్మకథనే ‘లోపలి మనిషి’గా

రచించిన ‘పి.వి’,అంతర్గతంగా ఎన్నో

అభిరుచుల మేళవింపు; సంగీతం,కంప్యూటర్

పరిజ్ఞానం,సినిమా, తత్త్వం , సంస్క్రతి,

నవలా రచన వంటి కళల కలబోత

భూ,ఆర్థిక సంస్కరణలతో మన

దేశాన్ని గాడికి తెచ్చి,కేంద్ర సాహిత్య

అకాడమి అవార్డును పొందిన ‘పి.వీ.’ అజాత

శత్రువుకు వేనవేల నమస్సులు.

సంధ్య సుత్రావె, సుల్తాన్ షాహి, హైదరాబాద్

Related posts

తొలి కోడి కూత

Satyam NEWS

తెలుగు వత్సరం

Satyam NEWS

చేత పెన్నుంటే……

Satyam NEWS

Leave a Comment