33.2 C
Hyderabad
May 15, 2024 13: 38 PM
కవి ప్రపంచం

దేశ గతిని మార్చిన మహా ‘ఋషి’

#Vadaparty Venkataramana

అతడు అనుభవాన్ని కూర్చోబెట్టి

విశేషానుభవం నేర్పగల అనుభవజ్ఞుడు

అతడు సుదూర ఆలోచనలకు

సూక్ష్మ పద్ధతిలో దారిచూపగల సమర్థుడు!

కుంటుపడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను

తన ప్రతిభ అనే పసరు పోసి

పట్టాలెక్కించిన రాజకీయ దురంధరుడతడు

సాహిత్య క్షేత్రంలో నిత్య సేద్యం చేసి

పఠితులుమెచ్చే అక్షర కంకుల్ని పండించి

సాహితీ సేవ చేసిన అక్షర హాలికుడతడు!

నిజాం పాలనను ధిక్కరించిన ధీరోదాత్త

సాహిత్యానికి నగిషీలు చెక్కిన సాహితీవేత్త

మాతృభాషపై మమకారమున్నా

బహు భాషలతో మెప్పించగల ప్రజ్ఞావంతుడు

తెలుగు జాతి ఖ్యాతిని దక్షిణాది కీర్తిని

విశ్వ యవనికపై రెపరెపలాడించిన

తొట్టతొలి దాక్షిణాత్యుడతడు

చాణక్యుని ప్రతిరూపమతడు!

అతడో ‘మనీషి’

దేశ గతిని మార్చిన మహా ‘ఋషి’!!

– వాడపర్తి వెంకటరమణ, గొల్లలవలస, శ్రీకాకుళం జిల్లా

Related posts

ఎదురీతలోనే ఆమె!

Satyam NEWS

ఓ మహిళా నీకు వందనం

Satyam NEWS

అక్షరమా…

Satyam NEWS

Leave a Comment