36.2 C
Hyderabad
May 15, 2024 16: 13 PM
కవి ప్రపంచం

తెలుగుతేజం

#VakitiRamreddy

పలుభాషలు నేర్చి ప్రతిభా చూపిండు

ప్రధాన మంత్రిగా ప్రగతి  పంచిండు

పాంచజనుడై పథికుఁడయ్యిండు

పంకజ నాభుడై ప్రజల దివించెను

సారదై భారత రథము నడిపిండు

సంస్కరణ శీలుడై దారిచూపిండు

సాహిత్య  సవ్యసాచిగా  ఎదిగి 

సకలగ్రంథాలకు ప్రాణమే పోసిండు

భూసంస్కరణలు అమలుచేసిండు

బుద్దిబలం తోటి పదవి నెగ్గిండు

బుద్ధుడై  భోధి వృక్షమయి నిలిచి

భారదేశం బంగరము అయ్యిండు

ఇందిర రాజీవ్ ఇలవేల్పుగా కోలిచి

ఇలలొనే ఇండియా పేరునిలిపిండు

ఇ నుడై ఇంద్రధనస్సుల మెరిసి

ఇజ్యుడై ఇందిర ప్రేమపొందిండు

ఎంతచదివినను  అంతఒదిగిండు

ఒదిగియున్నకొద్దీ ఎదిగే ఎవరెస్టుల

తెలంగాణ కిర్తిని దశదిశలు చాటి

తెలుఁగు తేజమై వెలుగు వెలిగిండు.

వాకిటి రామ్ రెడ్డి, పులిగిల్ల, యాదాద్రి భువనగిరి

Related posts

దేవుడా! నీవే దిక్కు

Satyam NEWS

అంతులేని కథ

Satyam NEWS

ఆకాశం భూమి మధ్యలో వాన

Satyam NEWS

Leave a Comment