26.7 C
Hyderabad
May 16, 2024 10: 55 AM
కవి ప్రపంచం

అసలైన బాలల పండగ

#J.Shyamala1

చాచా నెహ్రూ పుట్టిన రోజు

బాలలందరికి పండగ రోజు

టీవీలలో బాలల సందడే సందడి

కానీ మనో నేత్రం ముందు మరో చిత్రం…

ఇరానీ కేఫ్ లో కప్పులు కడిగే కరీం

కిరాణా షాపులో సరుకులందించే కిట్టు

ఫుట్ పాత్ పై బూట్ పాలిష్ చేసే రాజు

సిగ్నల్స్ దగ్గర కార్లను తుడిచే శీను

ఇళ్ల నిర్మాణంలో ఇటుకలు మోసే గౌరి

పార్కులో పల్లీలమ్ముకునే పాండు

పల్లెలో పశువుల్ని తోలే పరమేశు

బడాబాబు ఇంట్లో బాసన్లు తోమే భారతి

టపాసులు తయారు చేసే వెంకటేశు

చెత్త ఏరుకునే చిన్నారి చంద్రి..

బాలల పండగ బహుదూరమైన

అభాగ్య బాలలు ఎందరెందరో

పసి బతుకుల మసి తుడిచినప్పుడే

అది అసలైన బాలల పండగ

జె శ్యామల

Related posts

సంక్రాంతి పండుగ

Satyam NEWS

ఇలా కూడా

Satyam NEWS

మొంబత్తి

Satyam NEWS

5 comments

prsbhakaramsivvam November 17, 2020 at 4:46 PM

శ్యామలగారి బాలల.పండగ బాగుంది. ఆ పండగ ఎంతవరకూ బాలల పాలిట శాపంగా తయారయిందో , నిత్య జీవితంలో వారు పడుతున్న కష్టాలు ఏమిటో తెలియజేసారు. ఆ పండగనాడు ప్రభుత్వ పెద్దలు ఇచ్చే ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రమే మిగిలి పోతాయి. ఆ సభలకు హాజరైన బొజ్జల పెద్దద కడుపులు నింపుకోవడమే మిగిలిపోతుంది. బాలల పండుగనాడు కూడా పొట్ట నింపుకోవడం తెలియని దౌర్భాగ్యులు
మన బాలలు. బాలల వెతలను వివరంగా తెలియజేసిన శ్యామలగారికి అభినందనలు.
. ..
శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 7013660252.

Reply
Ramana Velamakakanni November 17, 2020 at 5:09 PM

Syamala’s poem is a true reflection of present day childhood of many. Let’s hope for good days to come.

Reply
vidadala sambasivarao November 17, 2020 at 9:44 PM

శ్రీమతి శ్యామల గారి”అసలైన బాలల పండగ” కవిత వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు దాటినా భావి భారత పౌరుల జీవన గమనంలో మార్పులు చాలా తక్కువే….నేటి వ్యవస్థను చక్కగా విపులీకరించారు రచయిత్రి….అభినందనలు.
కళాభివందనములతో
విడదల సాంబశివరావు.

Reply
Deepa November 17, 2020 at 10:15 PM

Its sad that this situation has not changed over the years. It is very nice of the author to raise awareness regarding this serious issue in poem form on this celebratory occasion.

Reply
Mramalakshmi January 16, 2021 at 5:50 PM

బాల కార్మికుల పరిస్థితికి తగిన కవిత మేడం ?

Reply

Leave a Comment