38.2 C
Hyderabad
May 3, 2024 19: 25 PM
Slider కవి ప్రపంచం

మొంబత్తి

#K.Haranath New Photo

దొరగారి ముల్లుగ్రర చూపుకి

వొళ్ళంతా హూనమైనా

ఓపిగ్గా నమ్ముకున్న మట్టిమీద

చెట్టంత ఆశతో

జీవిస్తున్న జీవి వీడు

కండవీడిది

పండగ వాడిది

కన్నీరు వీడిది

పన్నీరు వాడిది

జానెడు మాగాణి మడికి

వారసుడు వీడు

ఎకరాల ఎకరాల

భూమి సొత్తుకి

ఆసామి వాడు

పండిన ధాన్యం

వీడికి పిడికెడు

వాడికి పుట్లు పుట్లు.

కౌన్ కిస్కాగాడు వీడైతే

తూనికల తొండితో గెలిచిన

పెత్తందారువాడు

వానా వరద వరికుప్పను ముంచటాలు

మొండి బాకీలు వీడి వాకిట్లో ధ్వజమెత్తితే

వడ్డీకి చక్రవడ్డీ, చక్రవడ్డీకి వడ్డీ కలిపి

వడ్డించేదివాడు

పత్తి వీడిదే గుళ్ళొ  వొత్తి వీడిదే

ఇదే తరతరాల ఆచారం

అని కొట్టి పడేసుకుంటూ

కొట్టుమిట్టాడే ‘కొవ్వొత్తి’ కూడా వీడే.

(అంతర్జాతీయ రైతు దినోత్సం సందర్భంగా)

కొరుప్రోలు హరనాథ్, 9703542598

Related posts

భారత రాజకీయ – ఋషి

Satyam NEWS

భారత రష్యా సంబంధాలకు పుతిన్ పర్యటనతో బూస్టర్ డోస్

Sub Editor

నేను తొలేళ్ల రోజునే అమ్మవారిని దర్శనం చేసుకుంటా…!

Satyam NEWS

Leave a Comment