40.2 C
Hyderabad
May 5, 2024 15: 08 PM
కవి ప్రపంచం

ఎర్ర పతాక నీడలో…

#Vadaparty Venkataramana

గుక్కెడు గంజి నీళ్ళ కోసం

గుప్పెడు మెతుకుల కోసం

బతుకు బండి సాగడానికి

అనునిత్యం సంఘర్షణ పడుతూ…

యంత్రాలకు ఇంధనంగా

ఘర్మజలాన్ని ధారపోసి

అధునాతన భవనాలకు

కండరాలు కరిగించి

దేశం పొట్ట నింపడానికి

ఆరుగాలం కష్టపడి పండించి

దళారి గెద్దల పాదాల క్రింద

బడా బాబుల కనుసన్నలలో

భవిత కానరాని భరోసా దొరకని

జీవితాలు వాళ్ళవి!

అయినా…

సుత్తి కొడవలి ఆలంబనగా

బిగిసిన పిడికిలి ఆత్మవిశ్వాసంగా

సలిపిన ఉద్యమాలే ఊపిరిగా

చేసిన పోరాటాలే స్ఫూర్తిగా

రెపరెపలాడే ఎర్ర పతాక నీడలో…

కలసిరాని కాలంతో

నడిచి వెళుతున్న

కార్మిక,కర్షక,శ్రామిక సోదరుల్లారా…

మీకు వేనవేల వందనాలు!!

వాడపర్తి వెంకటరమణ, గొల్లలవలస, శ్రీకాకుళం జిల్లా, చరవాణి : 81795 78895

Related posts

పి.వి మన ఠీవి

Satyam NEWS

భయపడకు నేస్తమా…

Satyam NEWS

మళ్లీ జన్మించు

Satyam NEWS

Leave a Comment