33.2 C
Hyderabad
May 4, 2024 01: 17 AM
Slider కరీంనగర్

టెన్షన్:కత్తిపోట్లతో శివ మృతి లొంగి పోయిన నిందితులు

vemulawada murder

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం జరిగిన కత్తిపోట్ల కు గురైన నూగూరి శివ (30)కరీంనగర్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.శివ పై టీఆర్ఎస్ నేత వెంకటేష్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో గాయపడ్డ శివ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వెంటనే పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం శివ మృతి చెందాడు.

మున్సిపల్ ఎన్నికల్లో శివ ప్రత్యర్థి వర్గానికి సపోర్టు చేయటంతో కక్ష పెంచుకున్న వెంకటేష్ తో పాటు అతని సమీప బంధువు కంకణాల శ్రీనివాస్ మరో ఇద్దరు అతనిపై కత్తి తో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.కాగా మృతుడు శివకు భార్య ఒక కూతురు కుమారుడు ఉన్నారు.శివ పలు నేరాల్లో నిందితుడని ఒక వివాహితను హత్యచేసినట్లు అతనిపై రౌడీ షీట్ ఉందని పోలీస్ లు తెలిపారు.శివ తల్లి అమ్మాయి భార్య లత ల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ లు తెలిపారు.


హత్య కేసులో మరో కోణం అక్రమ సంబంధమేనా ?


నూగూరి శివ హత్య కేసులో మరో కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.మాజీ కౌన్సిలర్ వెంకటేశం కు శివకు మధ్య ఉన్న అక్రమ సంబదలావల్లనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.ఇరువురు ఒక మహిళతో సంబంధం పెట్టుకుని ఉండవచ్చని ఈ మేరకే వీరి మధ్య విద్వేషాలు పెరిగి హత్యకు కారణమై ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు.గత రెండు రోజులుగా వెంకటేశం శివ తల్లిని హెచ్చరించాడని శివ తనను చంపాలని చూస్తున్నాడని చెప్పగా ఆమె నేను శివకు సర్ది చెబుతానని చెప్పిందని తెలుస్తుంది.

ఐయితే శివ బుధవారం ఉదయం వెంకటేష్ గురించి ఆరా తీయగా తనకు ప్రాణ హాని ఉండనే ఉద్దీశం తోనే అటుగా వస్తున్నా శివను అడ్డుకుని వాగ్వాదం పెంచుకున్నాడని తెలుస్తుంది.దీని తో శివ వెంకటేశం ను బెదిరించగా అప్పటికే తన తో తెచ్చుకున్న కత్తి తో ఒక పోటు దవడ పై మరో పోటు చేతిపై వేయగా లోతుగా దిగిన కత్తి చేతి లోని నరాలు తెగి తీవ్ర రక్త స్రావం జరగడం తో శివ ప్రాణాలు వదిలినట్లు తెలుస్తుంది.కాగా రక్తం మడుగులో కొట్టుకుంటున్న శివను తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్తే బతికే వాడేమోనని అంబులెన్సులు 108 లు ఫోన్ చేసిన రాలేదని సుమారు అరగంట వరకు శివను అక్కడి నుండి తరలించలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.


లొంగి పోయిన నిందితులు ?


శివపై దాడి చేసిన తర్వాత మాజీ కౌన్సిలర్ వెంకటేష్,కంకణాల శ్రీనివాస్ లు వేములవాడ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తుంది.హత్య చేసిన అనంతరం వెంకటేష్వే ఇంటికి వెళ్లి చొక్కా మార్చుకుని పలువురిని హేచ్ఛరిస్తూ వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.వెంకటేశం పై పలు కేసులు ఉండటం తో పాటు రౌడీ షీటర్ ఉన్నట్లు పోలీస్గి లు తెలిపారు.

లొంగిపోయిన వీరిని పొలీసులు రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తుంది.కాగా ఈ హత్య వేములవాడ లో సంచలనం సృష్టించింది.శివ పోస్టుమార్టం సిరిసిల్లలో పూర్తి కాగా శవాన్ని కుటుంబ సబ్యులకు అందించేందుకు పొలీసులు సిద్ధం అయ్యారు. కాగా శివ కుటుంబం శవాన్ని వెంకటేశం ఇంటి ముందు వేసి ఆందోళన చేపట్టే అవకాశముందని అనుమానం తో పొలీసులు శివ ఇంటి పరిసరాల్లోకి చేరుకుంటున్నారు.

Related posts

బ్రిజ్‌భూషణ్‌ పై పోక్సో కేసు తొలగించాలని నివేదిక

Bhavani

మేనేజ్: మసాజ్ ముసుగులో విదేశీ వనితలతో వ్యభిచారం

Satyam NEWS

ఫర్ లార్న్:హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌‌లో ఉపాసన

Satyam NEWS

Leave a Comment