27.7 C
Hyderabad
May 16, 2024 04: 52 AM
Slider ఆధ్యాత్మికం

యూకే యూరప్ లలో శ్రీ మలయప్పస్వామి వారి కళ్యాణోత్సవాలు

యూకే మరియు యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పదకొండు (11) నగరాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహిస్తున్న విషయం విదితమే. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేదపండితులు తిరుమల నుండి తీసుకెళ్ళిన స్వామి, అమ్మవారి మూర్తులకు సంప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ట చేసి శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. అశేష సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి భక్తి పరవశంతో పులకించారు.

కళ్యాణోత్సవ అనంతరం తిరుమల నుండి తీసుకెళ్ళిన లడ్డూ ప్రసాదం భక్తులకు అందించడం జరిగింది. తితిదే చైర్మన్ శ్రీ వై.వీ. సుబ్బారెడ్డి సమన్వయ సూచనలతో ఇప్పటికే బేసింగ్ స్టోక్ – ఇంగ్లాండ్ లో బేసింగ్ స్టోక్ తెలుగు సంఘం, చెస్టర్ – ఇంగ్లాండ్ లో శ్రీ వైకుంఠమ్, బెల్ఫాస్ట్ – నార్త్ ఐర్లాండ్ లో నార్త్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, డబ్లిన్ – ఐర్లాండ్, ఇండో-ఐరిష్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్, జురిక్ – స్విట్జర్లాండ్ లో స్విస్ వేదిక్ భక్తీ ఫౌండేషన్ మరియు ఐండ్ హోవెన్ –

నెదర్లాండ్స్ లో SVK, భారతీయ, తెలుగు సంస్థల సహకారంతో ఇప్పటివరకు 06 నగరాలలో శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించడం జరిగింది. ప్రతి నగరంలోనూ ఆయా కార్యనిర్వాహక వర్గం సభ్యులు భక్తులకు ఎక్కడా, ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల నుండి అపూర్వ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా నిర్వాహకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి, తితిదే ఛైర్మన్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

ఆదివారం (30.10.22) ఐండ్ హోవెన్ లో జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవం తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. Stichting Vasudhaiva Kutumbakam (SVK) సంస్థ ముందుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించింది. ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి యూకే తెలుగు అసోసియేషన్ తో పాటు ఆయా నగరాలలోని తెలుగు, ధార్మిక, భారతీయ సేవా సంస్థలను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ కళ్యాణోత్సవంలో ఎక్కడా ఏ లోటు రాకుండా సమన్వయము చేస్తూ వచ్చారు. ఈ కళ్యాణోత్సవంలో ది హేగ్, నెదర్లాండ్స్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ రీనత్ సంధు, సత్య పినిశెట్టి, సెక్రటరీ (ఎకనామిక్స్ & కామర్స్) మరియు బెల్జియం భారత రాయబార కార్యాలయం నుండి అధికారులు హాజరయ్యారు. స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలిగినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. శ్రీవారి కళ్యాణోత్సవ క్రతువును SVBC ప్రత్యక్ష ప్రసారం చేసింది.

APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి, SVBC డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అక్కడి కార్యనిర్వాహకవర్గం సత్యప్రసాద్ కిల్లి, శివరామ్ తడిగొట్ల, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ కార్తీక్, SVK సభ్యులు కళ్యాణోత్సవం సజావుగా సాగేలా సమన్వయము చేసారు. శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణంలో స్థానిక తెలుగు, భారతీయ భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

బలిజ, కాపు, తెలగ కులస్తులకు రిజర్వేషన్ కల్పించాలి

Satyam NEWS

స్టేట్ మెంట్: ఇది సామాన్యుల బడ్జెట్

Satyam NEWS

సీఎం స‌హాయ‌నిధి రూ.2.50 ల‌క్ష‌ల చెక్కు అంద‌జేత‌

Sub Editor

Leave a Comment