27.7 C
Hyderabad
May 16, 2024 03: 51 AM
Slider కడప

జూన్ 28 నుండి జూలై 6వ వరకు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

#Swamy Brahmotsavam

అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 28 నుండి జూలై 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూన్ 27వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.

జూన్ 28న ఉదయం 9 నుండి 10 గంటల వరకు సింహ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.

వాహనసేవల వివరాలు

28-06-2023 ఉదయం – ధ్వజారోహణం రాత్రి – యాలి వాహనం
29-06-2023 ఉదయం – పల్లకీ సేవ రాత్రి – హంస వాహనం
30-06-2023 ఉదయం – పల్లకీ సేవ రాత్రి – సింహ వాహనం
01-07-2023 ఉదయం – పల్లకీ సేవ రాత్రి – హనుమంత వాహనం
02-07-2023 ఉదయం – శేష వాహనం రాత్రి – గరుడ వాహనం
03-07-2023 ఉదయం – సూర్యప్రభ వాహనం రాత్రి – చంద్రప్రభ వాహనం
04-07-2023 ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు) రాత్రి – గజ వాహనం
05-07-2023 ఉదయం – రథోత్సవం (ఉదయం 9 గంటలకు) రాత్రి – అశ్వవాహనం
06-07-2023 ఉదయం – చక్రస్నానం రాత్రి – ధ్వజావరోహణం

జూలై 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 7న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Related posts

ఢిల్లీ కోర్టులో పేలుడు.. రంగంలోకి దిగిన పోలీసులు

Sub Editor

ఏపిలో పరీక్షల నిర్వహణపై మండిపడ్డ సుప్రీంకోర్టు

Satyam NEWS

దళితబంధు కోసం పెద్దమల్లారెడ్డి దళితుల ఆందోళన

Satyam NEWS

Leave a Comment