26.7 C
Hyderabad
May 16, 2024 07: 23 AM
Slider విజయనగరం

స‌డ‌లింపు స‌మ‌యంలో నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న ….!

#VijayanagaramSP

ఓవైపు డిజాస్ట‌ర్ మేనేజెంట్ యాక్ట్ కింద కేసులు పెడ‌తాం…క‌రోనా వైర‌స్ సంద‌ర్భంగా నాలు సూత్రాలు ప్ర‌తీ ఒక్క‌రూ పాటించాలంటూ విజయనగరం జిల్లా ఎస్పీ స్వ‌యంగా చెప్పిన ఆడియో జిల్లా అంత‌టా బ‌హిరంగంగానే వినిపిస్తున్నా…ప్ర‌జ‌ల‌లో మార్పు రావ‌డం లేదు.

పోనీ చేతిలో లాఠీ ఎత్తుదామంటే…చేయ‌రాని నేరం అనేదీ వాళ్ల‌మే చేయ‌డం లేదు..కేవలం చెప్పినవి పాటించ‌కుండా ఉన్న కార‌ణంగా  ఇంకొక‌రికి మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ ను వ్యాపింప చేస్తున్నారు. ఏంటీ తిర‌గ‌డం మూలంగానే వ్యాప్తా అని నోరెళ్ల బెట్ట‌కండి…!

క‌రోనా వైర‌స్ అనేది గాలి ద్వారా వ్యాపిస్తుంద‌ని అదీ బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో వ్యాపించి ఉంటుంద‌ని నిపుణులు గ‌ట్టి గా చెబుతున్న వేళ‌..అంత్య నిష్టూరం క‌న్నా ఆది నిష్టూరం మేలు అన్న చందంగా క‌రోనా వైర‌స్ విప‌రీతంగా ప్ర‌బ‌లుతున్న వేళ ఏ ఒక్క‌రూ బ‌య‌ట‌కు తిరిగొద్దు, రావొద్ద‌ని చెబుతున్న‌ప‌ట్టికి..క‌ర్ఫ్యూ స‌డ‌లింపు స‌మ‌యంలో విచ్చ‌ల‌విడిగా జాగ్ర‌త్త‌లు పాటించ‌కుండా జిల్లా ప్ర‌జ‌ల‌కు వ్య‌వ‌హ‌రించ‌డాన్ని  ఎస్పీ ప్ర‌త్యక్షంగా చూసారు.

ఈసంద‌ర్భంగా విజయనగరంలోని బాలాజీ జంక్షను, కోట జంక్షను, న్యూపూర్ణ జంక్షను, కేపి టెంపుల్, సిఎంఆర్ జంక్షన్, గూడ్సు షెడ్ ప్రాంతాలను జిల్లా ఎస్పీ  రాజకుమారి, సందర్శించి, కర్ఫ్యూ అమలు తీరును స్వ‌యంగా పర్యవేక్షించారు.

ఈసంద‌ర్భంగా న‌గ‌రంలోని న్యూపూర్ణా జంక్ష‌న్ వ‌ద్ద న‌గ‌ర ప్ర‌జ‌లు వెళుతున్న తీరును ఎస్పీ ప్ర‌త్య‌క్షంగా చూసారు.అక్క‌డే ఉన్న ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు, న‌గ‌ర వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ,టూటౌన్ సీఐ శ్రీనివాస‌రావుల‌ను సూచ‌న‌లు ఇచ్చారు.అదే విధంగా 12 గంట‌ల‌కు ద‌గ్గ‌రుండీ షాపులు మూయించి  వేసారు.

Related posts

రాష్ట్రపతిని కలిసిన సద్గురు రమేష్‌ జీ, గురుమా

Satyam NEWS

ఏలూరులో మిత్రపక్షాల మధ్య విభేదాలకు తెర

Satyam NEWS

గుట్కా కావాలా? నో ప్రాబ్లం ఈ గాడిదలు తెచ్చిస్తాయి

Satyam NEWS

Leave a Comment