33.2 C
Hyderabad
May 15, 2024 22: 39 PM
Slider ప్రపంచం

అమెరికాలోని 5 లక్షల మంది భారతీయులకు శుభవార్త

#JoeBiden

ఎలాంటి ధృవపత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారికి పౌరసత్వం ఇచ్చే విషయంపై శాస్త్రీయ విధానం అవలంబించాలని అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ ఆలోచిస్తున్నారు.

మొత్తం కోటి 10 లక్షల మంది వరకూ అమెరికాలో ధృవపత్రాలు లేకుండా నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 5 లక్షల మంది భారతీయులు ఉన్నారు.

భారతీయులతో సహా దాదాపు అందరికి అమెరికా పౌరసత్వం ఇవ్వాలని జోబైడెన్ ఆలోచిస్తున్నారు. దీనికోసం శాస్త్రీయమైన విధానానికి రూపకల్పన చేసేందుకు ఆయన తొలి ప్రాధాన్యతనిస్తున్నారు.

అమెరికాలో నివాసం ఉన్న కుటుంబాలను సంరక్షించేందుకు వారి సభ్యులకు చట్టబద్ధమైన అర్హత కల్పించేందుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయన పని ప్రారంభించారు.

పసితనంలోనే అమెరికా వచ్చేసి పెరిగి పెద్దయిన వారికి చట్టబద్దంగా ఎలాంటి పత్రాలు ఉండటం లేదు. అలాంటి వారిని డిఏసిఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డహుడ్ ఎరైవల్స్) చట్టం మళ్లీ తీసుకురావడం ఉత్తమమని ఆయన భావిస్తున్నారు.

ఉద్యోగం కోసం వచ్చేవారికి గ్రీన్ కార్డులు ఇవ్వడం, అమెరికా పౌరసత్వం ఇచ్చే అంశాలలో నూతన ఒరవడి తీసుకువచ్చేందుకు జోబైడెన్ ప్రయత్నాలు ప్రారంభించారు.

Related posts

కట్టివేసి ఉన్న ఆవును తుపాకితో కాల్చి చంపిన దుర్మార్గుడు

Satyam NEWS

ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ లో చేరుటకు ప్రత్యేక అడ్మిషన్ల ప్రక్రియ

Satyam NEWS

58 జిఓ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి

Bhavani

Leave a Comment