33.2 C
Hyderabad
May 4, 2024 02: 53 AM
Slider నల్గొండ

రైస్ మిల్ డ్రైవర్ల వేతనాలు, అలవెన్సులు పెంచాలి

#ShitalaRoshapathi

పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రైస్ మిల్లు డ్రైవర్ల వేతనాలు, అలవెన్సులు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్ అసోసియేషన్ కార్యదర్శి సింగిరి కొండ శ్రీను కు అగ్రిమెంట్ నోట్ ఇచ్చిన సందర్భంగా రోషపతి మాట్లాడుతూ గత నెల 31వ, తేదీ నాటికి డ్రైవర్ల వేతన అగ్రిమెంటు రెండు సంవత్సరాలు పూర్తయినందున తిరిగి అగ్రిమెంటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, తక్షణమే జాయింట్ మీటింగ్  ఏర్పాటు చేసి కార్మికుల వేతనాలు, అలవెన్సులు పెంచవలసిన అవసరం ఉందని  యాజమాన్యాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు, ఐ ఎన్ టి సి నాయకులు సలిగంటి జానయ్య, గుండెబోయిన వెంకన్న, మల్లేష్, ఎల్లయ్య, పర్వతాలు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలకే అప్పగించాలి

Sub Editor

సోన్ మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ

Satyam NEWS

లొంగిపోయిన న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు

Satyam NEWS

Leave a Comment