26.7 C
Hyderabad
May 16, 2024 08: 07 AM
Slider ముఖ్యంశాలు

ఆదివాసీల గురించి ఆలోచించిన మహా నాయకుడు

#BRS Lok Sabha

ఆదివాసీల గురించి ఆలోచించి అభివృద్ధి చేసిన మహా నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. భద్రాచలం లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన గిరిజనోత్సవంలో ఎంపీ నామ మాట్లాడారు.

గిరిజన, ఆదివాసీ ల సమగ్రాభివృద్ధికి కేసీఆర్ పెద్ద పీట వేశారని అన్నారు. తెలంగాణా వచ్చిన తర్వాత గిరిజనుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

వారి ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచే వినూత్న కార్యక్రమాలను చేపట్టారని అన్నారు గిరిజన తండాలు, గోండు గూడేలను , చెంచు పెంటలను 3146 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, గిరిజనుల చిరకాల వాంఛను నెరవేర్చిన అపర భగీరథుడు అని అన్నారు.

వారి గ్రామ పంచాయతీ లను గిరిజనులే పాలించుకునేటట్లు చేశారని అన్నారు.ఎస్టీ ప్రత్యేక నిధిని ఏర్పాటు ఒక చరిత్ర అన్నారు. దశాబ్దాల పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపించిన ఘనుడని పేర్కొన్నారు. ఒకప్పుడు గిరిజన గూడెల్లో గిరిజనులు డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలతో మంచం పట్టి ఎంతో ఇబ్బంది పడేవారని, వారి దుస్థితిని తాను చాలా దగ్గరగా చూశానని అన్నారు.

నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అందించిన విషయాన్ని నామ గుర్తు చేశారు. ఈ 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసిన అద్భుత ప్రగతిని విస్తృతంగా ప్రజల్లోకి తీసికెళ్లాలని తెలిపారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఒక్క తెలంగాణా లోనే జరిగిందని అన్నారు.

మొండి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో మొండి ప్రభుత్వం ఉందని, ఏ విషయంలోనూ తెలంగాణా కు సహకరించ కుండా నిత్యం రాష్ట్రంపై కుట్రలు చేస్తుందని నామ నాగేశ్వరరావు అన్నారు. దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టి, ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యo లో ఆ రెండు పార్టీలు ఏనాడు రైతుల గురించి ఆలోచించలేదని నామ ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు, మోసపు మాటలు చెప్పినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, సీఎం అయ్యేది కేసీఆర్ మాత్రమేనని నామ స్పష్టం చేశారు.

రాబోయే కాలంలో కేసీఆర్ కు మరింత అండగా ఉండాలని నామ అన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గిరిజన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, గిరిజన సాంప్రదాయ కళాకారుదు శకినం రామచంద్రయ్య ను శాలువా, మెమెంటోతో సన్మానించారు.

Related posts

ఒమిక్రాన్‌ తరహా మరో వైరస్‌ గుర్తింపు

Sub Editor

నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ వెబ్ సైట్ ఆవిష్క‌రించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Satyam NEWS

రేసింగ్ పోటీల‌లో అప‌శృతి :13 ఏళ్ల శ్రేయ‌స్ దుర్మ‌ర‌ణం

Bhavani

Leave a Comment