40.2 C
Hyderabad
April 29, 2024 16: 52 PM
Slider ప్రపంచం

ఒమిక్రాన్‌ తరహా మరో వైరస్‌ గుర్తింపు

సౌతాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్‌ వేరియంట్‌పై సర్వత్రా ఆందోళన నెలకొంది. చాపకింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది ఈ వేరియంట్‌. ఇక దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే వ్యాధి తీవ్రతపై ఇప్పటి వరకు స్పష్టత లేనప్పటికీ వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలియడంతో దేశాలన్ని ఆందోళనకు గురవుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీనిని ఆందోళనకర వేరియంట్‌గా (VoC) ప్రకటించింది. ఇదే సమయంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ జన్యువులో మరిన్ని మార్పులకు గురైనట్లు తాజాగా ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో గుర్తించలేని ఒమిక్రాన్‌ తరహా రకాన్ని కనుగొన్నామని క్వీన్స్‌లాండ్‌ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

అయితే ఇది ఒమిక్రాన్‌లో కొత్త వేరియంట్‌ మాత్రం కాదని వారు స్పష్టం చేశారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టగా ఒక దానిలో వాస్తవ వేరియంట్‌తో పోలిస్తే అందులోని జన్యువులో మార్పిడి కలిగి ఉన్నట్లు గుర్తించారు. అలాగే సాధారణ పరీక్షల్లోనూ దీని గుర్తించే వీలు కలుగడం లేదని తెలిపారు.

Related posts

కొల్లాపూర్ మున్సిపాలిటీ లో దొంగలు పడ్డారు

Satyam NEWS

బీజేపీ నేతల ఇంటింటికీ మోడీ సందేశం కార్యక్రమం

Satyam NEWS

పల్లెల్లో కూడా ‘దిశ’ యాప్ వినియోగంపై పోలీసు శాఖ విస్తృత ప్రచారం

Satyam NEWS

Leave a Comment