28.7 C
Hyderabad
May 5, 2024 08: 38 AM
Slider నల్గొండ

వ్యతిరేక లేబర్ కొడ్ లను తక్షణమే రద్దు చేయాలి

#CITU

కేంద్రంలోని BJP  ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ పెట్టుబడి దారుల సేవలో తరించి పోతుందని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను రద్దు చేయాలని సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి రావు డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగిన కృష్ణ పట్టి ఏరియా సిమెంటు కార్మికుల విస్తృత సమావేశలో పాల్గొన్న యాదగిరి రావు మాట్లాడుతూ కార్మికుల పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి BJP పాలిత రాష్ట్రలలో ఆర్డినెన్సు జారీ చేయడం దురదృష్టకరమని అన్నారు.

లేబర్ చట్టాల కుదింపు వలన యూనియన్లు ఏర్పాటుకు కష్టతరం చేసిందని, కనీస వేతనాల చట్టం, బోనస్ చట్టం, సమ్మె హక్కులను హరించి కాల రాసిందని విమర్శించారు.

ఈ దేశ సంపద సృష్టి కర్తలైన కార్మికులు, కర్షకుల పొట్టలు కొట్టి కార్పోరేట్లలకు తాకట్టు పెట్టే చర్యలను శరవేగంగా అమలు చేసేందుకు, దేశ సంపదను ప్రభుత్వరంగ సంస్థలు కారు చౌకగా అదాని,అంబానీ  లాంటి వారికి కారు చౌకగా అవుతుందని అన్నారు. కారిమకుల హక్కులు, రక్షణ,వ్యవసాయ చట్టం రద్దు చేయాలని కోరుతూ కార్మిక వర్గం ముందు వుండి పోరాడాలని  అన్నారు.

ఈ సమావేశంలో సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, యలక సొమయ్య గౌడ్, తీగల శీను, లక్ష్మమ్మ, అజారుద్దీన్,ప్రభాకర్, ప్రభుదాస్, హనుమ నాయక్, రాజశేఖర్, వెంకన్న గోవింద్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వివాదాలకు నిలయంగా సుప్రసిద్ధ కాణిపాక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం…!

Satyam NEWS

శ్రీనివాసపురం కాలనీలో కార్పొరేటర్ కక్కిరేణి చేతన పర్యటన

Satyam NEWS

ట్రంప్ ఎఫెక్టు:రోడ్డున పడ్డ 45 పేద కుటుంబాలు

Satyam NEWS

Leave a Comment