38.2 C
Hyderabad
April 27, 2024 17: 18 PM
Slider చిత్తూరు

వివాదాలకు నిలయంగా సుప్రసిద్ధ కాణిపాక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం…!

kanipakamtemple

చిత్తూరు జిల్లా కాణిపాక ఆలయంలో మరోసారి బయట పడింది అధికారులు నిఘా వైఫల్యం. అధికార పార్టీ సీనియర్ నేత పీకేఎం- ఉడా చైర్మన్ నల్ల బాల వెంకటరెడ్డి యాదవ్ దంపతులు కాణిపాక దర్శనములో నిబంధనల కు విరుద్ధంగా మూలవిరాట్ విగ్రహ చిత్రీకరణ జరగడం వెలుగులో కి వచ్చింది. దంపతులిద్దరూ మూలవిరాట్ విగ్రహాన్ని దర్శనం చేసుకున్న ఫోటోలు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన వైనం సంచలనం రేకెత్తిస్తోంది. నిబంధనలు అతిక్రమించారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వెంకటరెడ్డి యాదవ్ దంపతుల వ్యవహారం. నిబంధనలకు విరుద్ధంగా మూలవిరాట్ విగ్రహ చిత్రీకరణ పై మండిపడుతున్నారు.. భక్తజనం.

నిన్నగాక మొన్న కాణిపాక నిత్య అన్నదాన సత్రంలో సిబ్బంది చేతివాటం వెలుగు చూసింది. కాణిపాక ఆలయం అనుబంధ ఆలయాల్లో అర్చకుడి ఇంటిలో బయటపడ్డ జింక చర్మాలు. తాజాగా వెంకటరెడ్డి దంపతులు దర్శనం చేసుకుంటున్నా మూలవిరాట్ విగ్రహం ఫోటోలు చిత్రీకరణ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఆలయ అధికారుల నిఘావైఫల్యానికి కారణమని బీజేపీ అంటోంది. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా కాకుండా రాజకీయ కేంద్రాలుగా మారిపోతున్నాయని బిజెపి రాష్ట్ర నాయకులు భాను ప్రకాష్ రెడ్డి విమర్శించారు.

కాణిపాకం ఆలయంలో ఆలయ గర్భగుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం పట్ల ఆయన స్పందించారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆలయ సభ్యుల నియామకం కావచ్చు ఇతర కార్యకలాపాలు కొనసాగించే వాళ్ళని అదే రీతిలో ఇప్పుడు కాణిపాకం ఆలయంలో ఆధ్యాత్మిక చింతన పూర్తిగా మంట కలిసిందని రాజకీయ కేంద్రంగా మారుతుందని విమర్శించారు. ఎంతమంది సిబ్బంది అధికారులు ఉన్నప్పటికీ కాణిపాకం ఆలయ గర్భగుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందంటే దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు తెలపాల్సిన అవసరం ఉందన్నారు ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని హిందుత్వాన్ని మంటగలిపే విధంగా ఉందని విమర్శించారు.

Related posts

కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ లో ఉపాధి అవకాశాలు

Satyam NEWS

మహిళా ఎస్సై శిరీషకు డిజిపి డిస్క్ అవార్డు ప్రదానం

Satyam NEWS

ఎలిగేషన్: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నది

Satyam NEWS

Leave a Comment