36.2 C
Hyderabad
May 15, 2024 16: 03 PM
Slider ఖమ్మం

ముక్కోటి  నిర్వహణకు  ఏర్పాట్లు

#ktdmcollector

ముక్కోటి మహోత్సవాలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు అప్పగించిన విధులను అంకితభావంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశపు హాలులో ముక్కోటి ఏకాదశి  మహోత్సవాలు నిర్వహణపై అన్ని శాఖల అదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన పనులను నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా  సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.  భక్తుల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా మన్నలను పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.  మహోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షణ భద్రాచలం ఆర్డీవో, బందోబస్తు ఏర్పాట్లు  పోలీస్ శాఖ చేపట్టాలని చెప్పారు.  లాడ్జి,  హోటల్ యజమానలనులతో సమావేశం నిర్వహించి ధరల నిర్ణయించాలని సబ్ కలెక్టర్ కు సూచించారు.  ఆలయ పరిసరాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.  భద్రాచలం,  దుమ్ముగూడెంలలోని దేవాలయాలను  విద్యుత్ దీపాలతో అలంకరించాలని చెప్పారు. భక్తులు మహోత్సవాలు వీక్షణకు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.  హంస వాసనం తనికి చేసి ద్రువీకరణ నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈఈ ని ఆదేసించారు. హంస వాహనంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించాలని చెప్పారు.  

భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా పటిష్ట భారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.  ఆహార పదార్థాలు నాణ్యతను తనిఖీ చేసి నివేదిక అంద చేయాలని ఆహార తనకి,  తూనికలు కొలత శాఖల అధికారులను ఆదేశించారు.  భద్రాచలం పట్టణాన్ని 15 జోన్లుగాను, పర్ణశాల ను 4 జోన్లు గాను విభజించి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.  దుమ్ముగూడెం లో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి పారిశుద్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.  ప్రతి సెక్టార్ కు ఏర్పాట్లు పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నట్లు చెప్పారు. భక్తులకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు.  భక్తులకు బస్సులు,  రైల్వే సమయాలను, అలాగే జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేయు చార్టులు ఏర్పాటు చేయాలని చెప్పారు. 

నూతన సంవత్సర కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.  భక్తులు వాహనాలను పార్కింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.  సబ్ కలెక్టర్, ఏఎస్పీ కార్యాలయాలల్లో కంట్రోల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. శ్రీరామనవమి మహోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించి  భక్తుల మన్ననలు పొందామని,  అదే స్ఫూర్తితో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలని తెలిపారు. అత్యవసర వైద్యచికిత్సా కేంద్రాలు అందజేయ ఏర్పాటు చేయాలని చెప్పారు.  అదనపు సిబ్బందితో పాటు అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని ఆయన వైద్య అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,  ఏఎస్పి రోహిత్ రాజ్,  దేవస్థానం ఈవో శివాజీ డిఆర్డిఓ మధుసూదన్ రాజు,   డిపిఓ రమాకాంత్ డి సి ఓ వెంకటేశ్వర్లు, వైద్యాధికారి డా దయానంద స్వామి, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహానాడులో ఒంగోలు దళిత డిక్లరేషన్ పై తీర్మానం చేయండి

Bhavani

ఏలూరు లో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ కలయిక..!

Satyam NEWS

22న సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరిన విహెచ్ పి

Satyam NEWS

Leave a Comment