30.7 C
Hyderabad
May 5, 2024 03: 33 AM
Slider ఖమ్మం

డిసెంబర్ 5న కేరళ ముఖ్యమంత్రి విజయన్ రాక

#agriculturalworkers

డిసెంబర్ 5న కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఖమ్మం రానున్నారని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా నేత యర్రా శ్రీనివాసరావు అన్నారు.  ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం కోటపాడు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన జనరల్ బాడీ సమావేశాలలో యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖమ్మంలో డిసెంబర్ 5 6 7 తారీకులలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతాయని అలాగే డిసెంబర్ 5న గొప్ప భారీ ప్రదర్శన గొప్ప బహిరంగ సభ జరుగుతుందని ఈ బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ముఖ్యఅతిథిగా వస్తున్నారనారు .

గ్రామాలలో వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తుందని కూలి రేట్లు పెరగాలని వ్యవసాయ కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకాలను కూడా వర్తింపజేయాలని 200 రోజులు పని కల్పించాలని రైతుబంధు రైతు బీమా పెట్టినట్లు వ్యవసాయ కార్మిక భీమా పెట్టాలని వ్యవసాయ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు  కూడా 5 లక్షల రూపాయలు బీమాని అందించాలని అలాగే వ్యవసాయం చేసుకునే కార్మికులకు వ్యవసాయం చేసుకోవడానికి రెండు ఎకరాల భూమిని ఇవ్వాలని గ్రామాలలో వ్యవసాయ కార్మికుల కోసం ఆరోగ్య  కేంద్రాలు పెట్టాలని వ్యవసాయ కార్మికుల పిల్లల కోసం వారి చదువుల కోసం రుణాలు ఇవ్వాలని ఆయన కోరారు. డిసెంబర్ 5న సర్దార్ పటేల్ స్టేడియంలో లక్ష మందితో బహిరంగ సభ జరగబోతుందని ఈ బహిరంగ సభలో వ్యవసాయ కార్మికులు ప్రజలు సానుభూతిపరులు హమాలీలు అనేక కార్మిక వర్గాలు అందరూ పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

పెంచిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

Satyam NEWS

ఈ నెల 16 నుండి రెండవ ఏఎన్ఎం ల నిరవధిక సమ్మె

Bhavani

4 కోట్ల 31 ల‌క్ష‌ల విలువైన జ‌గ‌న‌న్న విద్యాదీవెన చెక్కు  పంపిణీ

Satyam NEWS

Leave a Comment