38.2 C
Hyderabad
April 29, 2024 19: 15 PM
Slider ఆధ్యాత్మికం

రాజకీయ, ఆర్థిక సంక్షోభం… విశ్వవ్యాప్తంగా అలజడి

ఖగోళంలో దశాబ్దాల అనంతరం పక్షం రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న అరుదైన కేతు గ్రస్త పాక్షిక సూర్య గ్రహణం.. రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణాలు విశ్వవ్యాప్తంగా అలజడి.. రాజకీయ, ఆర్థిక సంక్షోభం రేపుతాయని ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి శ్రీనివాస గార్గేయ వెల్లడించారు. దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ, దేశాధినేతలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని , దీపావళి అమావాస్య నాడు తులా రాశిలో రాహు నకత్రమైన స్వాతి నక్షత్రంలో రవి, చంద్ర, శుక్ర, కేతు గ్రహాలు చాతుర్ గ్రహ కూటమిగా వున్న సమయంలో రావడం కేతు గ్రస్త సూర్య గ్రహణంగా పిలుస్తారన్నారు.

అలాగే 15 రోజుల వ్యవధిలో కార్తీక పౌర్ణమి నాడు దేవ దీపావళి రోజున అంటే నేడు మేష రాశిలో భరణీ నక్షత్రంలో రాహుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇలాంటి గ్రహణాలు అరుదుగా వస్తాయన్నారు. సుమారు వందేళ్ల క్రితం ఇదే తరహాలో ఏర్పడ్డ కేతు గ్రస్త సూర్య గ్రహణ సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైనదన్నారు. అమెరికా వాల్ స్ట్రీట్ కుప్ప కూలిందన్నారు. అలాగే పేరు మోసిన కంపెనీలు దివాలా తీసాయన్నారు. అదే విధంగా 27 ఏళ్ల క్రితం రాహగ్రస్త చంద్ర గ్రహణం వచ్చిన సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ లేమాన్ 2.76 లక్షల కోట్లకు దివాలా తీసిందని సోదాహరణగా వివరించారు. భారత దేశంలో పశ్చిమ భాగం, అరేబియా, హిందూ మహా సముద్రాల ప్రాంతాలలో గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని గార్గేయ తెలిపారు. ప్రధానంగా మధ్య ప్రదేశ్ పై అధిక ప్రభావం వుంటుందన్నారు.

అలాగే గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, గోవా రాష్ట్రాలలో ఈ ప్రభావం చూపుతుందని చెప్పారు. ముఖ్యంగా అరణ్య తాలలో భూ కంపాలు రావడం, లోహ విహంగాలు కూలడంతో పాటు తుఫాన్లు, సునామీలు వచ్చే ప్రమాదం వుందన్నారు. రష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం తీవ్ర తరం అవుతుందన్నారు. అలాగే ఇరాన్ – ఇరాక్ , భారత్ – పాకిస్థాన్, చైనాల మధ్య యుద్ద సఖ్యత లోపించి, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ప్రధానంగా పాకిస్తాన్ లో అంతర్గత పోరాటం జరుగుతుందన్నారు. అదేవిధంగా దేశాధినేతలకు రాజకీయంగా, ఆరోగ్యంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవాశముందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్నారు. మనీ లాండరింగ్ కేసులు ఎక్కువగా వుంటాయని, స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం వుంటుందని గార్గేయ వెల్లడించారు. ఆరు మాసాలు గ్రహణ ప్రభావం ఉంటుందన్నారు.

Related posts

బాసరలో నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

సీఏలు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయి

Bhavani

ఈ సారు ఇక్కడ అధికారి కాదు ఈ ప్రాంతానికి మహారాజు

Satyam NEWS

Leave a Comment