38.2 C
Hyderabad
May 3, 2024 22: 09 PM
Slider విజయనగరం

ప్రతిభ కనబర్చిన 28 పోలీసు సిబ్బంది కి అవార్డులు

#SP M. Deepika

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం.దీపిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలన్నారు.

ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోగల గ్రామాలను ఆయా పోలీసు స్టేషనులో పని చేసే పోలీసు సిబ్బందికి దత్తతగా ఇవ్వాలని, ఆయా గ్రామాల్లో తరుచూ గ్రామ సందర్శనలు చేయాలని, గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. గ్రామస్థాయిలో సమాచారం సేకరించేందుకు ముఖ్యమైన వ్యక్తులు, అధికారుల ఫోను నంబర్లను సేకరించాలని, సమాచార వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. న్యాయ స్థానాల్లో విచారణలో ఉన్న కేసుల్లో ప్రాసిక్యూషను లను ప్రాధాన్యత క్రమంలో సంబంధిత సిఐలు, ఎస్ఐలు గమనించాలని, నిందితులు శిక్షింపబడే విధంగా సాక్ష్యాలను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టి, నిందితులపై నేరం నిరూపణ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

వివిధ కోర్టుల్లో ప్రాసిక్యూషను కేసులను విధిగా సంబంధిత సిఐలు, ఎస్ఐలు మోనటరింగ్ చేయాలన్నారు. వివిధ కేసుల దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు సి.సి.టి.ఎన్.ఎస్.,లో నిక్షిప్తం చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపైన, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైనా, గంజాయి సేవించే వారిపైన, నాటుసారా తయారీ, రవాణ, అమ్మకాలు సాగించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. పోలీసు స్టేషను పరిధిలో నివసించే హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, వారంలో ఒకరోజు వారి నడవడిక, ప్రవర్తన గురించి విచారణ చేసి, కౌన్సిలింగు నిర్వహించాలన్నారు.

వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ప్రేలుడు, మందుగుండు సామగ్రి వలన ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత అధికారుల అనుమతితో వాటిని ప్రణాళిక ప్రకారం నిర్వీర్యంకు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ కేసుల్లో న్యాయస్థానాలు జారీ చేసే నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గత మాసంలో దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తు పూర్తి చేయలేక పోవుటకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తుపరమైన పలు సూచనలు చేసి, ఆయా కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ ఎం. దీపిక దిశా నిర్దేశం చేసారు.

విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చి వివిధ నేరాలను చేధించుట, చోరీ కేసుల్లో నిందితులను అరెస్టు చేయుట, ఇతర రాష్ట్రాల్లో నిందితుల నుండి చోరీ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, ట్రాఫిక్, కోర్టు విధులను సమర్ధవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక నేర సమీక్షా సమావేశంలో అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు. ప్రశంసా పత్రాలు పొందిన వారిలో.. (1) విజయనగరం రూరల్ పోలీసు స్టేషనుకు చెందిన (1) ఎ.త్రినాధరావు, ఎఎస్ఐ (2) షేక్ షఫీ (3) చీపురుపల్లి ఇన్స్పెక్టరు జి.సంజీవరావు (4) గరివిడి ఎస్ఐ బి.మురళి (5) చీపురుపల్లి కానిస్టేబులు ఎం. కుమారస్వామి (6) బుధరాయవలన కానిస్టేబులు పి.రమేష్ (7) గుర్ల కానిస్టేబులు ఎం.మురళి (8) 1వ పట్టణ ఎస్ఐ వి.అశోక్ కుమార్ (9) 1వ పట్టణ హెచ్.సి. ఎం. అచ్చిరాజు (10) 1వ పట్టణ కానిస్టేబులు పి. శివకుమార్ (11) చీపురుపల్లి ఎస్ఐ ఎ.సన్యాసి నాయుడు (12) చీపురుపల్లి కానిస్టేబులు ఎం. భానోజీరావు (13) చీపురుపల్లి కానిస్టేబులు సిహెచ్. జగదీష్ (14) 2వ పట్టణ ఎఎస్ఐ వై. పైడితల్లి (15) 2వ పట్టణ హెచ్.సి. టి.వి.ఆర్.కే.వి.ప్రసాద్ (16) కానిస్టేబులు

ఎం.వాసు (17) సిసిఎస్ హెచ్.సి. ఇమ్రాన్ ఖాన్ (18) సిసిఎస్ హెచ్సి డి. శంకరావు (19) సిసిఎస్ కానిస్టేబులు కే.సత్యం (20) సిసిఎస్ కానిస్టేబులు సి. హెచ్.వి. పైడిరాజు (21) ట్రాఫిక్ పిఎస్ హెచ్.సి అప్పలరాజు (22) ట్రాఫిక్ కానిస్టేబులు వై. సురేష్ కుమార్ (23) దిశ మహిళా పిఎస్ కానిస్టేబులు గోవింద్ (24) బొబ్బిలి హెచ్.సి. ఎం.శ్రీనివాసరావు (25) బొండపల్లి కానిస్టేబులు బి. రవికుమార్ (26) సంతకవిటి కానిస్టేబులు వై. రామరాజు (27) భోగాపురం హెచ్.సి. కే.శ్రీనివాసరావు (28) సంతకవిటి ఎస్ఐ ఆర్.జనార్ధనరావు ఉన్నారు. ఈ నేర సమీక్షా సమావేశంలో విజయనగరం ఇన్ చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డిటిసి డిఎస్పీ వీరకుమార్, దిశ మహిళా పిఎస్ డిఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ డిఎస్పీ

ఎల్.మోహనరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, న్యాయ సలహాదారులు వై. పరశురాం, సిఐలు జె. మురళి, జి. రాంబాబు, రుద్రశేఖర్, బి.వెంకటరావు, సిహెచ్. లక్ష్మణరావు, టి.వి. తిరుపతిరావు, ఎస్. బాల సూర్యారావు, విజయనాధ్, ఎల్. అప్పలనాయుడు, ఎం. నాగేశ్వరరావు, సింహాద్రి నాయుడు, ఎస్.తిరుమలరావు, రవి కుమార్, ఈ. నర్సింహమూర్తి, ఎస్.కాంతారావు, జి. సంజీవరావు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

తగ్గిస్తారా గద్దె దిగుతారా?: ప్రధాని పెడుతున్న వంటగ్యాస్ మంట

Satyam NEWS

[Free|Sample] Men S Health Supplement Virile Male Enhancement Pills

Bhavani

ఏప్రిల్ 14 నుంచీ రెండో సారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment