23.7 C
Hyderabad
May 8, 2024 04: 26 AM
Slider వరంగల్

ములుగులో ఇంగ్లీష్ భాష పై పోటీలు

#english

ములుగు జిల్లా స్థాయి స్పెల్ విజార్డ్(ఆంగ్ల భాష పదాలు),స్టోరీ టెల్లింగ్(కథా కథనం) పోటీలు జరిగాయి.  ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా)మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్,భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల చల్వాయిలో ఈ పోటీలు నిర్వహించారు. మండల విద్యా శాఖాధికారి గొంది దివాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతనెల 7వ తేదీన జరిగిన స్టోరీ టెల్లింగ్,స్పెల్ విజార్డ్ విభాగాలలో మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన 36 మంది విద్యార్థినీ,విద్యార్థులు 9 మండలాల నుండి పాల్గొన్నారు.

స్పెల్ విజార్డ్ విభాగంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సి హెచ్ ప్రణవి 9వ తరగతి,ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆకులవారి ఘనపూర్ ఏటూరునాగారం మండలం, ద్వితీయ స్థానం ఎల్.చందు 9వ తరగతి మోడల్ స్కూల్ జవహర్ నగర్ వెంకటాపూర్ మండలం.స్టోరి టెల్లింగ్ విభాగంలో ప్రథమ స్థానం వి.ప్రవళిక 9వ తరగతి మోడల్ స్కూల్ జవహర్ నగర్ వెంకటాపూర్ మండలం.ద్వితీయ స్థానం కె.వినీత 9వ తరగతి కె.జి.వి.బి ములుగు విద్యార్థులు విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.విజేతలుగా నిలిచిన విద్యార్థులను మెమెంటో,ప్రశంసా పత్రాలు ప్రదానం చేయడమైనది.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంజ రాజేశ్వర్ రావు,ములుగు జిల్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా )అధ్యక్షుడు బూత్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి బి.అనిత,ఉపాధ్యక్షులు కె. చెంచయ్య,డి.వాణి,సంయుక్త కార్యదర్శులు ఎం.డి.ఖలీల్,డి.ప్రణీత,కోశాధికారి సి.హెచ్ మల్లయ్య,స్టేటు కౌన్సిలర్స్ కె.రవి కుమార్,ఎం సంతోష్ కుమార్,కార్యనిర్వాహక సభ్యులు జి.వెంకటరమణ,మొలుగూరి రమేష్,కొత్త వెంకటేష్ వివిధ పాఠశాలల గైడ్ టీచర్లు పాల్గొన్నారు.

Related posts

కరోనా మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మానవత్వం

Satyam NEWS

నదీ జలాల వివాదం పరిష్కరించుకుంటేనే మేలు

Satyam NEWS

ప్ర‌జల భాగ‌స్వామ్యంతో అభివృద్ది ప్ర‌ణాళిక‌లు..!

Satyam NEWS

Leave a Comment