35.2 C
Hyderabad
May 11, 2024 18: 09 PM
Slider ప్రత్యేకం

ఏప్రిల్ 14 నుంచీ రెండో సారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర

#bandisainjai

కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేస్తాం: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేసే వరకు బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 14 నుంచీ రెండో సారి పాదయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు.కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతం చేసి ప్రజాస్వామిక తెలంగాణ సాధించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ఇందుకోసం బీజేపీ సాగిస్తున్న మహోద్యమానికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని మరోసారి హామీ ఇచ్చారు.

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను పార్టీ సీనియర్ నేతలు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ‘ఆశీర్వచన’ కార్యక్రమానికి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.  రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుండి వచ్చిన వేద పండితులు, పూజారులు వేద మంత్రోచ్చారణాలతో ఆశ్వీరదించారు. మెట్ పల్లి స్వామిజీ ప్రణవానంద, వేములవాడ రాజన్న ఆలయ పూజారులు బండి సంజయ్ కు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. డాక్టర్ కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, రఘునందన్ తదితరులు పుష్పగుచ్చం, శాలువాతో సంజయ్ ను సత్కరించారు. బండి సంజయ్ తో ఫొటోలు దిగేందుకు నాయకులు, కార్యకర్తలు పోటీ పట్టారు.

టీఆర్ఎస్ డౌన్ ఫాల్ క్లైమాక్స్ కు చేరిందని అందుకే కేంద్రాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా డబ్బులిచ్చి స్ట్రాటజీ టీం లను పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేస్తామని ప్రజాస్వామిక తెలంగాణ సాధిస్తామని బెంగాల్ తరహా రాజకీయాలు చేసినా, తాలిబన్, రజాకార్ల పాలన చేసినా ఎదిరించి పోరాడేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు… బండి సంజయ్.

ఈ ‘ఆశీర్వచన’ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయ శాంతి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, శాసనసమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీమంత్రి డాక్టర్ విజయరామారావు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్,  రాష్ట్ర కార్యదర్శలు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, కొల్లి మాధవి, బొమ్మ జయశ్రీ, అధికార ప్రతినిధులు పోరెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి, పాల్వాయి రజినీ, రాణి రుద్రమదేవి,  జిట్టా బాలక్రిష్ణారెడ్డి, కొత్త అశోక్ గౌడ్, సామ రంగారెడ్డి, దరువు ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

ద్వారకా తిరుమలలో నిత్యాన్నదానం పున:ప్రారంభం

Satyam NEWS

కంటి వెలుగు విజయవంతం చేయాలి

Bhavani

ఖబడ్దార్ మల్లారెడ్డి: కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Satyam NEWS

Leave a Comment