32.2 C
Hyderabad
May 16, 2024 11: 56 AM
Slider నల్గొండ

మునుగోడు స్థానం బీజేపీ దే..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ధీమా.!

#bandi

మునుగోడు ఎన్నికల ఫలితాలలో బీజేపీ కే ఓటర్లు పట్టం కట్టనున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేసారు. ఒక్కడిని ఓడించడానికి దండుపాళ్యం ముఠా లెక్క ఇంతమందిని దింపుతావా? మునుగోడుకు ఇచ్చిన హామీలెందుకు నెరవేర్చలేదో  సమాధానం చెప్పే దమ్ముందా? కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ పనులేమైనయ్? 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ ఏర్పాటు హామీలేమైనయ్… రాజీనామాతో రాజగోపాల్ రెడ్డి సాధించిందేమిటో….ఇవిగో చూడురాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలకు చేసిన అన్యాయం ఏమిటి?సొంత పగ కోసం కార్యకర్తల పోరాటాలను తాకట్టు పెట్టిన కమ్యూనిస్టులు అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు.

ఈ ఎన్నిక తెలంగాణలోని పేదల భవిష్యత్ ను మార్చేసే ఎన్నిక అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై శివమెత్తారు. భిచ్చమెత్తుకునే స్థాయి నుండి వేల కోట్లు సంపాదించుకునే స్థాయికి ఏ విధంగా ఎదిగారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి రావాలని సవాల్ విసిరారు.

ఈ ఎన్నిక తెలంగాణ పేదల తల రాతను మార్చే ఎన్నిక కాబోతోందని… నీతి, జాతి లేని టీఆర్ఎస్ రాక్షసులను తరిమి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ మనసున్న మంచి మనిషి అని పేర్కొన్న బండి సంజయ్… ఆయన రాజీనామాతో మునుగోడులో జరుగుతున్న అభివ్రుద్ధిని వివరాలతో సహా వెల్లడించారు. కమ్యూనిస్టులు సొంత పగ కోసం కార్యకర్తల పోరాటాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు పూర్తిగా కేసీఆర్ కు అమ్ముడుపోయారని, ఆయన చెప్పిన అభ్యర్ధికే టిక్కెట్ ఇచ్చారని విమర్శించారు.

మునుగోడు ప్రజలుకు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా రోడ్ షో నిర్వహించిన బండి సంజయ్ కు మర్రిగూడ మండల  కేంద్ర ప్రజలు వేలాదిగా తరిలి వచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రముఖ గీత రచయితలు దరువు ఎల్లన్న, నాగేశ్వరరావు మునుగోడు ఉప ఎన్నికలపై రచించిన పాటలను  ఆవిష్కరించారు. పలువురు టీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ స్వయంగా కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద జరిగిన సభకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి హాజరయ్యారు. సభకు హాజరైన వేలాది జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

రిక్వెస్టు చేసినా కేసీఆర్ డబ్బులు ఇవ్వలేదు

రాజగోపాల్ రెడ్డి కల్లాకపటం లేని మనిషి.  ఎన్నికల తరువాత రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధి చేద్దామనుకున్నాడు.. కానీ సీఎం మునుగోడుకు పైసా ఇయ్యలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ ను రిక్వెస్ట్ చేసినా? అసెంబ్లీలో నిలదీసినా? హెచ్చరించినా కేసీఆర్ అపాయిట్ మెంట్ కూడా ఇవ్వలే.. అప్పుడు రాజగోపాల్ రెడ్డికి బీజేపీకి గుర్తుకొచ్చిందన్నారు.

రాజగోపాల్ రెడ్డి మనసున్న మనిషి. పేద వాడు వెళితే బాధ చెప్పుకుంటే సాయం చేసే గుణం ఆయనదని పార్టీ అభ్యర్ధని సంజయ్ అన్నారు. అంతకుముందు ఏనాడైనా ఇంత మంది మీ ఊరికి వచ్చిండ్రా? మీ బాధ విన్నరా? ఏనాడైనా నీళ్లు లేవంటే పట్టించుకున్నారా? అంటూ నిలదీశారు.      

కుర్చీ వేసుకుని కూర్చుని చర్లగూడెం రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తానని, 1.75 లక్షల ఎకరాలకు నీళ్లిస్తానన్నవ్… ఏమైందిని సూటిగా ప్రశ్నించారు.ఫ్లోరైడ్ సమస్య నావల్లే పరిష్కారమైందని చెప్పిన కేసీఆర్ కు సిగ్గులేదు… ఏయ్ కేసీఆర్… ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని 2003లోనే వాజ్ పేయి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలన్నింటికీ నిధులిస్తోంది బీజేపీ ప్రభుత్వమేనని బండి స్పష్టం చేశారు.మర్రిగూడ నుండి సవాల్ చేస్తున్నా…. 8 ఏండ్లలో ఎన్ని నిధులిచ్చావు? ఎన్ని ఇండ్లు మంజూరు చేసినవ్? ఎంతమందికి ఉద్యోగాలిచ్చినవ్? ఎంతమందికి దళిత బంధు ఇచ్చినవ్? ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవ్? ఎంతమందికి నిరుద్యోగ భ్రుతి ఇచ్చినవో చెప్పాలని ప్రశ్నించారు.

మునుగోడు ఎన్నికలు మీకు సంబంధించిన ఎన్నికలు కావు.. తెలంగాణ భవష్యత్ నిర్ణయించే ఎన్పికలన్నారు. కేసీఆర్ … నీకు దమ్ముంటే టీఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల తో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి రా….అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు.కేసీఆర్ ది ఒకప్పుడు బిచ్చపు బతుకు అని ఒకనాడు పైసలు కట్టకుంటే కారును గుంజుకుపోయిండని.. ఫైనాన్స్ కట్టలేదని ప్రచార రథాన్ని కూడా గుంజుకుపోయారని ఆనాడు తిండికి లేని కేసీఆర్ ఇవాళ 100 కోట్లతో విమానాన్ని ఎట్లా కొన్నారో ప్రజలకు చెప్పాలే… ఫాంహౌజ్ ఎట్లా కొన్నారో, వేల కోట్లు ఎట్లా సంపాదించారో ప్రజలకు సమాధానం చెప్పాలే అని అన్నారు.

నీతి, జాతి లేని రాక్షసులను తెలంగాణ నుండి తరిమి తరిమి కొట్టే అవకాశం బీజేపీకి ఇవ్వాలని కోరుతున్నా… ఈ ఎన్నికలు మీకు మాత్రమే పరిమితం కాదు… తెలంగాణలోని పేదల భవిష్యత్తుకు ముడిపడి ఉన్నవి.. వాళ్ల పక్షాన రెండు చేతులెత్తి జోడిస్తున్నా… పువ్వు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ ను పాతరేయండని స్పష్టం చేశారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ పేరు వింటేనే టీఆర్ఎస్ గజగజ వణుకుతోందని అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ దెబ్బకు టీఆర్ఎస్ భయపడి ఇక్కడే మకాం వేసిందని. మీకో అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. రాజకీయ చైతన్యం ఉన్న మునుగోడు ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలన్నారు. మొన్న దుబ్బాక, నిన్న హుజూరాబాద్,  రేపు మునుగోడు బీజేపీదే కాబోతోందనని స్పష్టం చేశారు.

Related posts

విశాఖ పోర్టుకు తొలి సారి వచ్చిన భారీ రవాణా నౌక

Satyam NEWS

బ్యాంకులు ప్రయివేటీకరణ చేస్తే పొదుపుకు ముప్పు

Satyam NEWS

ప్రజాస్వామ్యం, లౌకిక శక్తుల రక్షణే ధ్యేయం

Bhavani

Leave a Comment