26.7 C
Hyderabad
May 16, 2024 08: 09 AM
Slider గుంటూరు

అన్నదాతలను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

#TDPnarasaraopet

అందరికీ అన్నంపెట్టే అన్నదాత రోజురోజుకి అప్పుల ఊబిలో కురుకుపోతున్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు వైసీపీ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డా౹౹చదలవాడ మాట్లాడుతూ వ్యవసాయానికి ఉపయోగించే విత్తనాలు,ఎరువులు, రసాయనాలు, కూలీల వేతనాలు అన్నీ పెరిగిపోతుండడంతో రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, బయట అప్పులు చేసి దుక్కిదున్ని ఆరుగాలం శ్రమించిన తరువాత పంట చేతికి వస్తోందో లేదో కూడా తెలియని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉందని డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.

రైతులకు ఎరువులను కూడా అందించలేని దయనీయ పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఇందుకు ప్రధాన కారణం వ్యవసాయ రంగానికి ఉపయోగించేవి కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయని,కార్పొరేటు సంస్థలు చెప్పిందే వేదంగా ఉండటంతో రైతులకు వేరే గత్యంతరం లేకుండా పోయిందని, ఇదే సమయంలో వ్యవసాయ ఉత్పతులకు గిట్టుబాటు ధరలు ఉండడం లేదని, వైసీపీ ప్రభుత్వం నుండి సరైన సహకారం లేకపోవడంతో రైతుల పరిస్థితి దీనావస్థకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తరతరాలుగా భూమిని నమ్ముకుని వ్యవసాయాన్ని చేస్తున్న రైతులు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఏ విధంగా నష్టపోయారా అర్ధమవుతొంది అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల,రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి ఆ హామీని గాలికి వదిలేశారని ,  వ్యవసాయ పెట్టుబడి తీసుకునే బ్యాంకు రుణాల పై వడ్డీ లేకుండా చేస్తామని ప్రతి సంవత్సరం మే నెలలో రూ.12500/- రైతులకు బ్యాంకు అకౌంట్ లో వేస్తామని,ప్రతి రైతు కుటుంబానికి ఉచితంగా బోర్లు వేస్తామని,రైతులు పండించే పంటలకు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణకు నిధులు విడుదల చేస్తామని, ప్రతి మండల కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేస్తామని,ప్రకృతి  విప్పత్తులకు రైతులు పంటలు నష్టపోతే నాలుగు వేల కోట్ల నిధులు మంజూరు చేస్తామని,సకాలంలో ప్రతి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.

ముందు జాగ్రత్త లేకుండా రైతులకు పొటాషియం, ఎరువుల నిల్వలు చేసి సీజన్ లో కూడా రైతులకు అందించలేని దయనీయ స్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉందంటే రైతులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు ఆశలు కల్పించి, నమ్ముకున్న రైతులను మోసంతో నయవంచనతో మోసగించారని విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్ధన్ బాబు, రాష్ట్ర రైతు కార్యదర్శి కడియం కోటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిర్మాణ రంగం కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి

Satyam NEWS

మూత్ర‌నాళ వ్యాధికి అధునాత‌న‌ శ‌స్త్రచికిత్స

Satyam NEWS

ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా పోస్టర్

Bhavani

Leave a Comment