29.7 C
Hyderabad
April 29, 2024 08: 44 AM
Slider హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్

#kaleruvenkatesh

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారని, సబ్బండ వర్గాల ప్రజలను కలుపుకుని, కొన్ని కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, ఎన్నో ఏళ్ల కలను నిజం చేసే క్రమంలో ఉద్యమ నాయకుడు ఆయన అని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం ఆయన ప్రత్యేకత అని ఎమ్మెల్యే అన్నారు.

బుధవారం అంబర్ పేటలోని ఎస్విఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన అంబర్ పేట నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా వరుసగా తొమ్మిదోసారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కెసిఆర్ కి అంబర్ పేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.

టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన  నేపథ్యంలో మలి దశ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడి ప్రజలకు పరిపాలన చేతకాక రాష్ట్రం అంధకారమైపోతుందన్న వారందరూ ఆశ్చర్యపోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తూ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఈ రెండు బాధ్యతలను ఓకే వ్యక్తి సాధించడం అనితర సాధ్యమని, అది ఒక్క కెసిఆర్ కి మాత్రమే చెల్లిందని కొనియాడారు.

అంబర్ పేట్ లో మౌలిక సదుపాయాలకు నిధుల మంజూరు

అంబర్ పేట నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, పలు అభివృద్ధి పనుల గురించి మంత్రి కేటీఆర్ తో చర్చించగా, వారు సానుకూలంగా స్పందించారని త్వరలోనే నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దేశంలో రైతుల పట్ల బీజేపీ కర్కశంగా వ్యవహరిస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం రైతు బంధు పథకంతో అండగా నిలవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల జీవనాన్ని దుర్భరం చేసిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడమే అతి కష్టమైన స్థితిలో ఉందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లాలో నవంబర్ 15 న విజయ గర్జన సభ నిర్వహించనున్న నేపథ్యంలో అంబర్ పేట నియోజకవర్గం నుండి వేల సంఖ్యలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయ గర్జన సభకు సంబంధించి ఎవ్వరికీ ఏ ఇబ్బందీ కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయని, అందరినీ సమన్వయం చేసుకునేలా పార్టీ నాయకులకు తీసుకోవలసిన బాధ్యతలను ఎమ్మెల్యే సమావేశంలో వివరించారు.

ఈ సమావేశానికి గోల్నాక డివిజన్ కార్పోరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ హాజరు కాకపోవడం ఎమ్మెల్యేకు కార్పోరేటర్ కు మధ్య రోజురోజుకు వైరుధ్యం పెరిగి అగ్గిరాజుకుంటుందని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పోరేటర్ ను సమావేశానికి ఆహ్వానించడం లేదని మరి కొందరు అంటున్నారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు పులి జగన్, పద్మావతి రెడ్డి, గరిగంటి శ్రీ దేవీ, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు సిద్ధార్థ్ ముదిరాజ్, కొమ్ము శ్రీనివాస్, మేడి ప్రసాద్, భీష్మ, చంద్ర మోహన్, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, ఉద్యమ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సత్యంన్యూస్, అంబర్ పేట్

Related posts

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Bhavani

అర్ధరాత్రి విజయనగరం లో ఆపరేషన్ నైట్ స్టార్మింగ్…!

Satyam NEWS

ఆకట్టుకుంటున్న అక్కినేని నాగచైతన్య “థ్యాంక్యూ” టీజర్

Satyam NEWS

Leave a Comment