28.7 C
Hyderabad
May 5, 2024 08: 10 AM
Slider ఖమ్మం

పేద ప్రజలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

#kalyana

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబందించి చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం విడివోస్ కాలనిలోని క్యాంపు కార్యాలయంలో పంపిణి చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ కు సంబంధించి చెక్కులను 68 మంది లబ్ధిదారులకు, బిసి లకు ఆర్ధిక సహాయంకు గాను, 42 మంది లబ్దిదారులకు, మైనార్టీ లకు ఆర్థిక చేయూత క్రింద 26 మందిలబ్ధిదారులకు, మొత్తంగా రూ.1.36 కోట్ల విలువైన చెక్కులను మంత్రి స్వయంగా లబ్దిదారులకు పంపిణి చేశారు.

పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఈ క్యాంపు కార్యాలయంలో అందించడం జరిగిందన్నారు. వందల కోట్ల రూపాయలు ఈ వేదిక ద్వారా అందించడం చాలా సంతోషంగా ఉందని ఇది నాకు దేవాలయం తో సమానమని మంత్రి అన్నారు. పేద ప్రజల అభ్యున్నతిని కాంక్షించి, పేదలందరు తన కాళ్ళ మీద తాము ఎదగాలని తమకు చేతనైన వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని ఆర్ధికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు అందిస్తున్న ఈ పథకాల ద్వారా ఆర్ధిక సాయం అందుకున్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

ఇదే క్యాంపు కార్యాలయం నుండి పేద ఇంటి ఆడపిల్లల పెళ్లి చేసిన తల్లిడండ్రులకు ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 8,733 మందికి గాను రూ. 82.41 కోట్ల రూపాయలు పంపిణి చేయడం జరిగిందన్నారు. వివిధ చికిత్సలు చేసుకుని సిఎల్ఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న 5,124 చెక్కులను గాను రూ. 20.48 కోట్లు పంపిణి చేయడం జరిగిందన్నారు. దీనితో పాటు ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాల పంపిణికి ఇది వేదిక అయిందని ఆయన తెలిపారు.

అనంతరం లబ్ధిదారులకు మంత్రి ఏర్పాటు చేసిన భోజనాలను నగర మేయర్ పునుకొల్లు నీరజ ప్రారంభించి వారికి స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపుకలెక్టర్ బి.సత్యప్రసాద్, జెడ్పిటిసి ఎం. ప్రియాంక, నగర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పఠనాసక్తిని పెంపొందించేందుకు విద్యాశాఖ దృష్టి

Satyam NEWS

అవతార పురుషుడు:కృష్ణావతారంలో యాదాద్రి లక్ష్మీనరసింహుడు

Satyam NEWS

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

Bhavani

Leave a Comment