29.7 C
Hyderabad
May 4, 2024 06: 01 AM
Slider మహబూబ్ నగర్

బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత

#manuchowdaryias

బాలల హక్కుల వారోత్సవాల గోడపత్రికలను నాగర్ కర్నూల్ జిల్లా పి ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ మను చౌదరి ఆవిష్కరించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్ లో ఇందిరా ప్రియదర్శిని ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ బాలల హక్కులను ఎప్పుడూ గౌరవిస్తూ వారిని  కాపాడాలని చెప్పారు. బాలల అందరూ బడిలొనే ఉండాలని  బాల కార్మికులుగా మారకూడదని, బాల్యవివాహాలు జరగకుండా, బాలలపై వేధింపులు లేకుండా  బాలల హక్కుల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని చెప్పారు. 

 పిల్లలకు ఏదైనా ఆపదవస్తే బాలల నేస్తం 1098 ఫోన్ చేయుట గురించి  అందరికి అవగాహన కల్పించాలని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాను  “బాలల స్నేహపూరిత జిల్లా” గా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.

ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు బాలల హక్కుల పరిరక్షణ పై అవగాహన కల్పించేందుకు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చైల్డ్ లైన్ సంస్థ సభ్యులు వెల్లడించారు.

సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ పలువురు జిల్లా అధికారులు బ్యానర్ పై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో  చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ మధు బాబు, కోఆర్డినేటర్ మనీ, చైల్డ్ లైన్ సభ్యులు సునీత, లలిత, అరుణ, శ్రీజ, జావిద్ శ్రీనివాస్, భరత్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిగ్ బ్రేకింగ్: ఆ లేఖ నేను రాసిందే

Satyam NEWS

బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కు కరోనా

Satyam NEWS

[Natural] Male Enhancement Products Toys

Bhavani

Leave a Comment