33.7 C
Hyderabad
April 27, 2024 23: 16 PM
Slider గుంటూరు

చిలకలూరిపేటలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి వేడుక

#veerabrahmendraswamy

గుంటూరు జిల్లా చిలకలూరిపేట 17 వవార్డు సుబ్బయ్యతోట లో జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యములో జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి వేడుక జరిగింది. గుంటు వెంకటప్పయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో కార్తీక శుద్ధ ద్వాదశి  జగద్గురువు, కాలజ్ఞాన కర్త,జీవ సమాధి నిష్ఠ వహించిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి సందర్భముగా వేడుకలను నిర్వహించారు.

ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ స్వామిని పూజిస్తారని, ప్రపంచానికి జ్ఞాన బోధ చేసి, ప్రపంచం లో జరిగే వింతలు, ప్రకృతి లో సంభవించే మార్పులను ఆనాడే తెలియ చేసిన మహానుభావుడని, స్వామి వారు చేసిన మహిమలు,ఆయన వ్యతిరేకించిన జంతు బలులు,బాల్య వివాహాలు వ్యతిరేకించిన సంఘ సంస్కర్త అని విద్యార్థులు కు తెలియచేశారు.

అనంతరం విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు, చరిత్రలో ఉన్న ఆధ్యాత్మిక  మహా పురుషులు గురించి చిన్నతనం నుంచే పిల్లలకు తెలియ చేసి వాళ్లలో ఆధ్యాత్మికత ను పెంపొందించి,సంఘం పట్ల,దేశం పట్ల, గౌరవాన్ని,భక్తి ని కలుగజేయాలని కోరారు. విద్యార్థులకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి స్టిక్కర్ల ను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు అనంత లక్ష్మీ, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

చోరీ అయిన సింహాచలం శ్రీ అప్పన్న ఇత్తడి కానుకల స్వాధీనం

Satyam NEWS

డిసెంబ‌రు రెండో వారం నుండి అందుబాటులోకి డైరీలు, క్యాలెండ‌ర్లు

Satyam NEWS

లంపి వైరస్ తో మృతిచెందిన పశు యజమానులకు పరిహారం

Satyam NEWS

Leave a Comment