33.2 C
Hyderabad
May 15, 2024 22: 44 PM
Slider నల్గొండ

ఎంపీ ఉత్తమ్ పై బిఆర్ఎస్ మంత్రుల అసత్య ప్రచారం

#protest

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దిష్టిబొమ్మను దాహనం చేసిన పట్టణ కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ శ్రేణులు

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు,ప్రజాప్రతినిధులు,బూతు కమిటీ అధ్యక్షుల సమావేశంలో తన్నీరు మల్లికార్జున్ రావు మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి ప్రభుత్వ పథకాలను నామినేషన్ రోజు కన్నా ముందుగా నవంబర్ రెండో తారీకు వరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేయాలని ఈసీని కోరగా దానికి రాష్ట్రం లోని బిఆర్ఎస్ మంత్రులు,స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎంపీ ప్రభుత్వ పథకాలను నిలిపి చేయాలని ఈసీ ని కోరినారని వక్రీకరించి అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.30 రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాబోతుందని, హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలవబోతున్నారని, సైదిరెడ్డి  కెనడా వెళ్లి తన వృత్తిని కొనసాగించుకోవాల్సిందేనని,ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి, హుజూర్ నగర్ నియోజకవర్గంలో సైదిరెడ్డికి ప్రజలు  ఓట్ల రూపంలో బుద్ధి చెప్పడం ఖాయమని   అన్నారు.

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఒక సైకో అని,అరాచక వాదని,ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం తేవాలని చూస్తున్నారని,ఇవన్నీ కూడా ఓటమి భయంతో చేస్తున్నారని తన్నీరు మల్లికార్జున్ రావు అన్నారు.అనంతరం ఇందిరా సెంటర్లో యూత్ కాంగ్రెస్ శ్రేణుల  ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్,ఎమ్మెల్యే సైదిరెడ్డి దిష్టిబొమ్మలను దాహనం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, పి.సి.సి ప్రతినిధి దొంగరి వెంకటేశ్వర్లు,పి సి.సి మాజీ సభ్యుడు సాముల శివారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,మున్సిపల్ చైర్మన్ గెల్లి రవి, అర్చన,కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,కౌన్సిలర్లు తేజావత్ రాజా నాయక్,అమరబోయిన సతీష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల మల్లయ్య,సైదా మేస్త్రి,వల్లభదాసు కృష్ణగౌడ్, ఆదర్ల శ్రీనివాస్ రెడ్డి,మూడేం గోపిరెడ్డి, సుంకరి శివరామ్ యాదవ్,వెలిదండ వీరారెడ్డి,బొల్లెద్దు జైలు,కోడి ఉపేందర్ యాదవ్,కోల్లపూడి యోహాన్,వీర్లపాటి భాస్కర్,ఎడ్ల విజయ్,బెల్లంకొండ గురవయ్య,మేళ్లచెరువు ముక్కంటి,పాశం రామరాజు,చింతకాయల రాము, దొంతగాని జగన్,ఎడవల్లి వీరబాబు, మోదాల సైదులు,రెడిపంగు రాము,కస్తాల రవీందర్,అయిల వెంకన్న గౌడ్,పశ్యా వెంకట్ రెడ్డి,కస్తాల సైదులు,తేజావత్ సైదులు నాయక్,ఇట్టి మల్ల బెంజిమెన్, గొట్టేముక్కుల రాములు,రేపాకుల కోటయ్య,పులిచింతల అంజిరెడ్డి,చప్పిడి సావిత్రి,గడ్డం వెంకటమ్మ, లచ్చిమల్ల నాగేశ్వరరావు,ముషం సత్యనారాయణ,  బంటు సైదులు,పోతుల జ్ఞానయ్య, సలిగంటి జానయ్య,సలిగంటి గణేష్,షేక్ ఉద్దండు,ఫరీద్,కందుల రాము,దాసరి పున్నయ్య,కోల మట్టయ్య,అంజనపల్లి సుదర్శన్,జింజిరాల సైదులు,మామిడి కాశయ్య,కందుల వినయ్,పులి బాలకృష్ణ, చిరంజీవి,తెప్పని యలమంద,కందుల వెంకటేశ్వర్లు,నేపాల్,తేలుకుంట్ల వెంకటేశ్వర్లు,పల్లపు వెంకటేశ్వర్లు,చిన్నం శ్రీనివాస్,కడియం రామకృష్ణ,పాలకూరి లాలు,తమ్మిశెట్టి రాము,షేక్ అనిఫ్ పాషా, తమ్మిశెట్టి ఏడుకొండలు,మార్క్స్,అధిక సంఖ్యలో యూత్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

GO 317 : తొమ్మిదికి పెరిగిన ఉపాధ్యాయుల ఆత్మహత్యలు

Satyam NEWS

శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా

Satyam NEWS

వెంకటగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా గిరిజ కుమారి

Satyam NEWS

Leave a Comment