35.2 C
Hyderabad
May 9, 2024 16: 59 PM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ రాజకీయ పార్టీ కాదు.. లాబీయింగ్ పార్టీ

#protest

రేవంత్ రెడ్డి మాట తప్పారు

తన వాళ్లకు న్యాయం చేయలేని వారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారా

మదన్ మోహన్ ఎలా తిరుగుతాడో చూస్తా

రెబల్ గా బరిలో నిల్చుంటా.. గెలుస్తా

రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ చెప్పినా వినేది లేదు

కార్యకర్తలను చూసి భావోద్వేగం.. వెక్కివెక్కి ఏడ్చిన సుభాష్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ కాదని, ల్యాబీయింగ్ పార్టీ అని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్లారెడ్డిలోని తన నివాసంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు సుభాష్ రెడ్డిని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. వాళ్ళను చూసి ఇప్పటిదాకా నాయకులను నమ్ముకున్న.. నన్ను మోసం చేశారు.. ఇక మీదే బాధ్యత.. కాపడుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం అంటూ సుభాష్ రెడ్డి వెక్కివెక్కి ఏడ్చారు. సుభాష్ రెడ్డి కంట నీరు చూసిన కార్యకర్తలు రాజీనామా చేయాలని కోరారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న అనంతరం సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చేదు లాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదన్నారు.

2018 లో నామినేషన్ వేస్తే ఎంపీ టికెట్ ఇస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ టికెట్ మదన్ మోహన్ రావుకు ఇస్తే ఆయన కల్వకుంట్ల కుటుంబానికి కోవర్టు అని నాటి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీగా మదన్ కు అవకాశం ఇచ్చిన పార్టీ ఆదేశాల మేరకు మదన్ మోహన్ గెలుపు కోసం పని చేశానని చెప్పారు. ఇప్పటికి తన పేరు మదన్ మోహన్ అని తప్ప ఇంటిపేరుతో ఎక్కడ ఫ్లెక్సీ వేసుకోడని, తాను చేసే ప్రతి సేవా కార్యక్రమానికి పార్టీ నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలు, బస్సులు ఏర్పాటు చేశానన్నారు. నాడు విత్ డ్రా అయినట్టుగా ఇప్పుడు కూడా విత్ డ్రా అవుతానను అనుకుంటున్నారేమో.. నా గొంతులో ప్రాణం పోయినా ఆ పని చేయను అని స్పష్టం చేశారు.

రేపటినుంచి మదన్ మోహన్ రావు నియోజకవర్గంలో ఎలా తిరుగుతాడో చూస్తా అంటూ సవాల్ చేశారు. 2018 లో తాను పిసిసి ప్రెసిడెంట్ కాదని, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పాడన్నారు. ఎవరి అభిప్రాయం తీసుకుని మదన్ మోహన్ కు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. తనను నమ్ముకున్న ఇద్దరికి న్యాయం చేయలేని రేవంత్ రెడ్డి రేపు ఆరు గ్యారెంటీలకు ఏం న్యాయం చేస్తాడని నిలదీశారు. ఎక్కడినుంచో వచ్చి మదన్ మోహన్ రావు ఇక్కడ డబ్బు, అహంకారం చూపిస్తున్నాడన్నారు.

ఏనాడు కూడా మదన్ మోహన్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, నియోజకవర్గంలో 30 లక్షల ఇన్సూరెన్స్ కట్టి 12 లక్షల మందికి చెక్కులు అందించిన ఘనత తనదని చెప్పారు. ‘మదన్ మోహన్ నీకు దమ్ముంటే రా.. ఇక చూసుకుందామని సవాల్ చేశారు. నన్ను కొంటా అని మదన్ మోహన్ అంటున్నాడట.. నన్ను కొనడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. మదన్ మోహన్ కోసం చేతి గుర్తుపై ఓటేసి గెలిపిస్తే బీఆర్ఎస్ లోకి వెళ్తాడని, 3 నెలలు అమెరికాలో ఉండేవాడు కావాలో.. నిరంతరం ప్రజల్లో ఉండేవాడు కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. కార్యకర్తల అభిష్టం మేరకు రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంటా.. గెలిచి చూపిస్తానన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినా షబ్బీర్ అలీ చెప్పినా వినేది లేదన్నారు. ప్రస్తుతం తనకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ కో ఆర్డినేటర్, టిపిసిసి డెలిగేట్ పదవులకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తనతో పాటు ఉన్న నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో వేసిన కాంగ్రెస్ కమిటీలను రద్దు చేస్తున్నామన్నారు. అనంతరం ఇంటి ఆవరణలో ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలు, జెండాలను చించివేసిన కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలుపుతూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జెండాలను తగులబెట్టారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

గంగా విలాస్ క్రూయిజ్ ను ప్రారంభించిన ప్రధాని

Bhavani

ఫుడ్ కోర్టు లో మొక్కలు నాటిన మంత్రి అల్లోల

Satyam NEWS

తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్నిటీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment