27.7 C
Hyderabad
April 30, 2024 07: 34 AM
Slider నిజామాబాద్

సొంతింటి కల నెరవేరుస్తా: బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి

#katipalli

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం ద్వారా మహిళలకు సొంతింటి కలను నెరవేరుస్తామని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో సుమారు 5 వేల మంది బీడీ కార్మిక మహిళలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల్ కోట్ లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమై నిర్మించిన 40 వేల ఇళ్ల వీడియోను మహిళలకు చూయించారు.

అనంతరం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో పరిష్కారం చుపాలనే ఉద్దేశంతో ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సేవా కేంద్రాలు, కళ్లాల ఏర్పాటుతో మేనిఫెస్టో విడుదల చేశామని తెలిపారు. అంతే కాకుండా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి స్వంత ఇంటి కళ నెరవేర్చాలనేది తన ఉద్దేశమని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం ద్వారా స్వంత ఇల్లు కట్టిస్తామని మహారాష్ట్రలో అకుల్ కోట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం సహాయంతో 40వేల ఇళ్లు కట్టించడం జరిగిందని, అదే తరహాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్లు కట్టించి బాధ్యత తనదన్నారు.

ఈ ఇంటి నిర్మాణానికి పూర్తిగా 7లక్షల రూపాయలతో నిర్మాణ వ్యయంలో అమృత పథకం ద్వారా రోడ్లు, డ్రైనేజీ, ఇతర సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం 75 వేల రూపాయలు ఇస్తుందని, ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు  ఇస్తుందని, 3 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీతో వినియోగ దారుడికి రుణం అందజేశాస్తారని రాష్ట్ర ప్రభుత్వ వాటా లక్ష రూపాయలు ఉంటుందన్నారు. 25వేల రూపాయలు ఇల్లు నిర్మాణం జరిగే సమయంలో వినియోగదారులు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కామారెడ్డిలో స్వంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ  ఇంటి నిర్మాణం చేయించి ఇస్తానని హామీ ఇచ్చారు.

కేసీఆర్ గెలిస్తే ప్రజలకు దొరుకుతాడా..?

మంత్రులు ఎమ్మెల్యేలకే అందుబాటులో ఉండనీ కేసీఆర్ జక్కడ గెలిస్తే కామారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటాడా అని వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని దోమకొండ మండల కేంద్రంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంలో వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ గెలిచి ఎక్కడో ఉంటే సామాన్య ప్రజలకు కష్టం వస్తె ఎవరికి చెప్పుకోవాలన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే నవగ్రహాల అరాచకాలకు అడ్డు అదుపు ఉండదన్నారు. బీజేపీ కి ఓటు వేస్తే అవినీతికి తావు ఉండదని హామీ ఇచ్చారు. ప్రజలు ఆలోచించి బీజేపీకి ఓటు వేయాలని కోరారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

జర్నలిస్టుల రైల్వే రాయితీ కొనసాగింపుకు సిఫార్సు

Satyam NEWS

యువగళం’ పేరిట నారా లోకేశ్‌ పాదయాత్ర

Bhavani

కాశ్మీర్ లో ఘనంగా సాగుతున్న ఇంటింటిపై త్రివర్ణ పతాకం

Satyam NEWS

Leave a Comment