29.7 C
Hyderabad
May 4, 2024 04: 15 AM
Slider మహబూబ్ నగర్

తెలంగాణ మాల మహానాడుకు కరోనా వారియర్స్ అవార్డు

#malamahanadu

సహాయ పౌండేషన్ వారు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ కు తెలంగాణ మాలమహానాడును ఎంపిక చేశారు. సహాయ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందచేశారు.

కరోనా  భయానక సమయంలో తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో చేసిన సేవలను గుర్తించి సహాయ పౌండేషన్ వారు 2020-2021 సంవత్సరానికి ఈ అవార్డును ప్రధానం చేసి సత్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ సహాయ పౌండేషన్ ఫౌండర్ టాంకరి శివప్రసాద్ యాదవ్ సహాయ పౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా నాలుగు వేల మందికి నిస్వార్ధంగా రక్తదానం చేశారన్నారు.

కరోనా  భయానక సమయంలో సొంత వాళ్లే దూరం పెట్టిన పరిస్థితిలో కరోనాకు  భయపడకుండా దాదాపుగా 50 రోజులు ఉదయం రాత్రి భోజనాలు అందించారని అన్నారు.

అంతేకాకుండా చనిపోయిన వారికి వారి ఆచార పద్ధతిలో కరుణ తో దాన సంస్కారాలు చేసిన ఘనులు సహాయ ఫౌండేషన్ సభ్యులని కొనియాడారు.

ఏర్పాటైన మొదటి సంవత్సరం లోనే అనేక సామాజిక కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు.

తనకు ఈ అవార్డు ప్రధానం చేయడం సంతోషంగా ఉంది అని అన్నారు. అంతేకాకుండా మీద మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.

Related posts

ప్రశాంత్ కిషోర్ ఒక్క సారి ఏపి వైపు కూడా చూడు

Satyam NEWS

అప్పుడు బాగా ఖర్చు చేశా ఇప్పుడు ఆదా చేయాలి

Satyam NEWS

ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం

Satyam NEWS

Leave a Comment