ఎన్నార్సీ, సిఏఏ, ఎన్ పి ఆర్ కు మద్దతిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రశాంత్ కిషోర్ ఏపిలో ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న పనులను కూడా చూడాలని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన ప్రశాంత్ కిషోర్ కు బహిరంగ లేఖ రాశారు. గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సలహాదారులుగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించిన విషయం తెలిసిందే.
కాని ఏపి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలకు దాసోహమంటూ లోక్ సభ, రాజ్యసభలలో ఎన్నార్సీ, సిఏఏ బిల్లులకు మద్దతిచ్చారని ఏపీ అసెంబ్లీ లో ఎన్నార్సీ, సిఏఏలకు వ్యతిరేకంగా తీర్మానం చేయమని జగన్మోహనరెడ్డికి సూచించాలని రామకృష్ణ కోరారు.