26.7 C
Hyderabad
May 16, 2024 09: 29 AM
Slider ముఖ్యంశాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు పట్టాల పంపిణీ

#KTR

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటీంచారు . ఈ క్రమంలోనే ఆయన తంగళ్లపల్లిలోని వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇందులో భాగంగానే పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.

ఇటీవలే కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది రైతులకు పోడు పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టారని, ఈ క్రమంలోనే పట్టాలు పొందిన ఆదివాసీ రైతులకు రూ.23.56 కోట్లు విలువ చేసే రైతుబంధు చెక్కులను అందించామని వివరించారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో.. పోడు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు.

ఇక నుంచి ఈ భూములకు 3 ఫేజ్​ కరెంట్​ ఇవ్వాలని.. విద్యుత్​ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. పోడు భూముల్లో ఆదివాసీలు బోర్లు వేసుకునేందుకు గిరివికాసం పథకం కింద.. ప్రభుత్వం బోర్లను వేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.

Related posts

కొత్త జిల్లాల్లో.. ఇక జిల్లా జడ్జీ కోర్టులు

Satyam NEWS

కార్మికులారా ఏకంకండి హక్కులు సాధించే వరకు పోరాడుదాం

Satyam NEWS

భారత్ కు తాలిబన్ల తొలి లేఖ.. విమానాలు నడపాలంటూ విజ్ఞప్తి

Sub Editor

Leave a Comment