37.2 C
Hyderabad
May 2, 2024 11: 28 AM
Slider విజయనగరం

మరోసారి గజపతినగరం పోలీసు స్టేషన్ ఆకస్మిక తనిఖీ

#inspection

విజయనగరం జిల్లా పోలీసు శాఖ పరిధి…బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గజపతినగరం పోలీసు స్టేషన్ ను మరోసారి ఎస్పీ దీపికా తనిఖీ చేసారు.ఈ సందర్భంగా స్టేషన్ లో రికార్డులు, సిడి ఫైల్స్, రీసెప్షన్ రికార్డులు, ప్రాపర్టీ రికార్డులు పరిశీలించారు. అనంతరం, మహిళ సంరక్షణ పోలీసులతో మమేకమై, క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన విధులపై పలు సూచనలు చేశారు. రహదారి ప్రమాదాల నియంత్రణకై చర్యలు చేపట్టాలని గజపతినగరం ఎస్ఐ ను ఆదేశించారు..ఈ ఆకస్మిక తనిఖీల్లో బొబ్బిలి డిఎస్పీ  పి.శ్రీధర్,  గజపతినగరం ఎస్ఐ గంగరాజు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అయితే తొలి సారి స్టేషన్ ను తనిఖీ చేసిన సమయంలో ఉన్నడీఎస్పీ, సీఐ ,ఎస్ఐలు…ఈ సారి తనిఖీ లో వారు బదిలీ అయినట్లు తెలుస్తోంది.

Related posts

కాప్రాలో అన్ని సౌకర్యాలు కలిగిన ఆసుపత్రి అందుబాటులోకి

Satyam NEWS

వైసీపీలో దగాపడ్డ ఓ సుధ కథ ఇది…..

Satyam NEWS

చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వొద్దు

Satyam NEWS

Leave a Comment