Slider ఖమ్మం

ఎలక్టోరల్ సర్వే త్వరగా పూర్తి చేయాలి

#Electoral survey

ఎలక్టోరోల్ సంబంధ డోర్ టు డోర్ సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లో ఆర్.ఓ.లు, తహసీల్దార్లు, బూత్ లెవల్ సూపర్వైజర్ లతో సర్వే ప్రక్రియ లో పురోగతి, ఫారం-6,7,8 ల పరిష్కారం పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డోర్ టు డోర్ సర్వే వేగంగా జరుగుతున్నట్లు, నిర్ధారిత లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బూత్ లెవల్ అధికారులు డోర్ టు డోర్ సర్వే లో చేపట్టాల్సిన అంశాలపై పూర్తి అవగాహన కల్గివుండాలన్నారు.

ఇంట్లో ఓటు హక్కు కు అర్హత ఉండి, ఓటు హక్కు లేని వారిని గుర్తించి ఫారం-6 సేకరించాలన్నారు. షిఫ్టెడ్, మరణించిన ఓటరు వివరాలు సేకరించాలన్నారు. దివ్యాoగులు, 80 సంవత్సరాల పై వయస్సు వారిని గుర్తించి, మార్క్ చేయాలన్నారు. ప్రతి ఇంటి నుండి మొబైల్ నెంబర్ సేకరించాలన్నారు. పెండింగ్ ఫారం 6, 7, 8 లపై పరిశీలన పూర్తి చేసి, త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

Related posts

రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రావచ్చు

Satyam NEWS

కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో నమాజుపై నిషేధం

Satyam NEWS

సీబీఐ స్పందిచనందునే ఏసీబీ దర్యాప్తు చేయిస్తున్నాం

Satyam NEWS

Leave a Comment