38.2 C
Hyderabad
May 5, 2024 21: 25 PM
Slider ఖమ్మం

ఖమ్మంకు పాకిన డ్రగ్స్ వ్యవహారం

#drug deal

హైదరాబాద్‌లో కలకలం రేపిన డ్రగ్స్ కేసు మూలాలు ఖమ్మంలో గుర్తించారు. ఇది కాస్తా బడా వ్యాపార వేత్తలు, ప్రముఖులు నివసిస్తున్న శ్రీరాం హిల్స్ పరిసర ప్రాంతాలకు పాకినట్లు తెలుస్తున్నది. ఖమ్మం నగరం శివారు ప్రాంతంగా ఉన్న శ్రీరామ్ హిల్స్‌ను కొంతమంది అక్రమ వ్యాపారాలు, భూ దందాలు వంటి మరెన్నో అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మార్చుకున్నట్లు తెలుస్తున్నది.

డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరి ఖమ్మంలో ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతానికి వచ్చి మంతనాలు జరిపాడని తెలుస్తున్నది.అధికారులతో కొన్ని భూ వివాదాల్లో తల దూర్చి కోట్లల్లో సంపాదించాడని సమాచారం.

గృహ సముదాయంలో ఎవరి ఇంటికి వచ్చాడు.. ఎందుకు వచ్చాడు.. ఎలాంటి వ్యాపారం నిర్వహించాడు వంటి అంశాలపై గోప్యంగా విచారణ జరుగుతున్నది. ఇతను ఎవరి కోసం ఖమ్మం రాకపోకలు సాగించాడు అనే కోణంలో కూపీ లాగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇతడితో అంటకాగిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తున్నది.

ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్ పెడ్లర్ కేపీచౌదరి వ్యవహారం ఇదే సముదాయానికి చుట్టుకొని ఉండటం సరికొత్త వివాదానికి తెరతీసిందని సమాచారం. కేపీ చౌదరి ఖమ్మం వాసి కావడం అనేక మంది ఇదే సామాజిక వర్గం నుంచి సినీ ఇండస్ట్రీలో ఉండటం వారితో పరిచయాలు ఉండటంతో పాటు ఖమ్మం, హైదరాబాద్ రాకపోకలు సాగిస్తుండటంతో ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లు అయిందని భావిస్తున్నారు.

కేపీ చౌదరి ఖమ్మంలో అనేక మంది ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతానికి వచ్చి కొంత మంది ప్రముఖులతో మంతనాలు జరిపాడని సమాచారం. ప్రముఖ అధికారులతో కొన్ని భూ వివాదాల్లో తల దూర్చాడని సమాచారం. ఇతనికి ఉన్న పరిచయాలతో హైదరాబాద్, ఖమ్మంలో పలు భూ దందాల్లో జోక్యం చేసుకొని కోట్లల్లో అక్రమార్జనకు పాల్పడినట్లు సమాచారం. కేపి చౌదరికి వచ్చి పోయే ఆ భారీ గృహ సముదాయంలో ఎవరి ఇంటికి వచ్చాడో ..? ఎందుకు వచ్చాడో ..? ఎలాంటి వ్యాపారం నిర్వహించాడో తెలియాల్సి ఉంది. ఆయన రాకపోకలకు సంబంధించిన విచారణ గోప్యంగా జరుగుతున్నట్లు సమాచారం.

అకస్మాత్తుగా డ్రగ్స్ దందాలోకి వచ్చి ఉండడని సిని ప్రొడ్యుసర్‌గా ఎదగడం వెనుక ఇతను చేసిన అక్రమాలు ఏమున్నాయో..? ఎలాంటి వ్యక్తులు ఇతనికి సహకరించారో ..? ఇతను ఎవరి కోసం ఖమ్మం రాకపోకలు సాగించాడో అనే కోణంలో హైదరాబాద్ స్థాయి అధికారులు కూపి లాగుతున్నట్లు సమాచారం. ఆయనతో అంటకాగి, అతను చెప్పింది చేసిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్లు తెలుస్తుంది.

ఇన్ని రోజులు ఒలకబోసిన పెద్దరికం ఈ దెబ్బకు భూ స్థాపితం అయ్యి.. తాము తీసుకున్న గోతిలో పడతామని భావించి ఆందోళన చెందుతున్నారట. కాపాడమని ఎవరిని అడగాలి .. ఈ వ్యవహారంలో ఎవరు కాపాడుతారో తెలియక టెన్షన్ పడుతున్నారు. తాజా పరిణామాలతో కేపి చౌదరి సన్నిహితులు, అనేక మంది ప్రముఖులు తలలు పట్టుకుంటున్నారు.

Related posts

కెసిఆర్ మనవనికి రేషన్ బియ్యం పెడతారా..?

Satyam NEWS

ఇది చెరువు కాదు… జగనన్న కాలనీ

Satyam NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment