39.2 C
Hyderabad
May 4, 2024 20: 03 PM
Slider మహబూబ్ నగర్

ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి: వనపర్తి జిల్లా కలెక్టర్

#coronavaccine

ఎలాంటి అపోహలకు లోనుకాకుండా 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ప్రజలకు సూచించారు. శనివారం గోపాల్ పేట మండలం మున్ననూర్, వనపర్తి మున్సిపాలిటీ లోని బాలానగర్ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రతి గ్రామంలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని 18 ఏళ్ల పైబడిన వారు తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. గ్రామాలలో సర్పంచ్, అధికారులు, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సిన్ కేంద్రాలకు తరలించాలని అన్నారు.

కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమీ జరగదని మామూలుగా జ్వరం మాత్రం వస్తే టాబ్లెట్ లు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ నమోదు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. రెండు రోజులలో 100% వ్యాక్సిన్ వేయించుకునే లా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

Satyam NEWS

Finest Hookup Apps To Search Out Casual Intercourse In 2023

Bhavani

నిందితుడిని ప‌ట్టి ఇచ్చిన‌….సాంకేతిక ప‌రిజ్ఙానం…ఘ‌ట‌నా స్థ‌లిలో ఆన‌వాళ్లు….!

Satyam NEWS

Leave a Comment