29.7 C
Hyderabad
May 7, 2024 04: 51 AM
Slider ముఖ్యంశాలు

నిందితుడిని ప‌ట్టి ఇచ్చిన‌….సాంకేతిక ప‌రిజ్ఙానం…ఘ‌ట‌నా స్థ‌లిలో ఆన‌వాళ్లు….!

#accident case

సాధార‌ణంగా హైవేల‌పై  త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతూ ఉంటాయి. వేగంగా వెళ్ల‌డం, మ‌ద్యం సేవించి డ్రైవ్ చేయ‌డం, ప‌రాధీనంలో ఉండ‌టం మూలంగానే హైవేల‌పై ప్ర‌మాదాలు జ‌రుగుతూ ఉంటాయి. ఆ ర‌కంగానే  స‌రిగ్గా వారం రోజుల క్రితం ఏపీలోని జాతీయ ర‌హదారి నెంబ‌ర్ 5  ద‌గ్గ‌ర‌లో  విజ‌య‌న‌గ‌రం జిల్లా  పూసపాటిరేగ మండలం, కనిమెట్ట ఎన్.హెచ్ 16  పై ఓ టూవీల‌ర్ ,ఓ కారు ఢీ కొన్నఘట‌న‌లో బైక్ ప్ర‌యాణం చేస్తున్న భార్యాభ‌ర్త‌లు అక్క‌డిక్క‌డే మృతి చెందారు.

స‌రిగ్గా గ‌త నెల 31 వ తేదీన మ‌ధ్యాహ్నం…12 గంట‌ల ప్రాంతంలో ప్ర‌మాదం జ‌ర‌గడం..హాటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లికి పూస‌పాటి రేగ పోలీసులు వెళ్ల‌డం..ఓ వైపు ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేయ‌డం  మ‌రోవైపు ఘ‌ట‌నా స్థ‌లిలోనే  మృత‌దేహాల‌ను పోస్ట్ మార్టం నిమిత్తం హాస్ప‌ట‌ల‌కు పంపించ‌డంతో పాటు అక్క‌డే ఉన్న ap 39bv 9909 ఎర్టికా కార్ ను పోలీసులు సీజ్ చేసి..ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను అన్వేషించే ప‌నిలో ప‌డ్డారు.

సీన్ క‌ట్ చేస్తే వారం రోజుల్లో ప్ర‌మాదానికి కార‌కుడైన డ్రైవ‌ర్ 33 ఏళ్ల నాయిని శంక‌ర్ రెడ్డి ప‌ట్టుకున్నారు…పూసపాటిరేగ పోలీసులు…అదీ ఎస్ఐ జ‌యంతి.ఈ సంద‌ర్భంగా జిల్లా పోలీస్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్, ,పూసపాటిరేగ ఎస్ఐ జ‌యంతిలు మాట్లాడారు.

హైవేలో ప్ర‌మాదాలు చాలా జ‌రుగుతూ ఉంటాయ‌ని కొన్ని అక్క‌డిక్క‌డే అందుకు గ‌ల కార‌ణాల‌నుతెలిసిన‌ప్ప‌టికీ..మ‌రి కొన్నింటికి అంత స‌లువుగా ద‌ర్యాప్తు చేయ‌లేమ‌ని…కానీ ఈ క‌నిమెట్ట ప్ర‌మాదం కేసులో…సాంకేతిక ప‌రిజ్ఙానం, ఘ‌ట‌నా స్థ‌లిలో ఎస్ఐ జ‌యంతి క‌నిపెట్టిన ఆధారాల‌తో ప్ర‌మాద కార‌కుడిని పట్టుకున్నామ‌న్నారు.

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే దాదాపు 13 వాహ‌నాల‌ను సీసీ కెమారాలో  గుర్తించాని కాని ఈ ap 39bv 9909 నెంబ‌ర్ గ‌ల‌ ఎర్టికా కార్ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లిలో కారుకు  ఉన్న సైంటిపిక్ ఆధారంతో షోరూమ్ ద్వారా డ్రైవ‌ర్ శంక‌ర్ రెడ్డి ని ప‌ట్టుకోగ‌లిగామ‌న్నారు.

అంత‌కు ముందు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణం,…అందుకు గ‌ల‌ వ్య‌క్తిని ఎలా ప‌ట్టుకున్నామో…పూస‌గుచ్చిన‌ట్టు మీడియాకు పూస‌పాటిరేగ ఎస్ఐ జ‌యంతి వివ‌రించారు. ప్ర‌మాదం మ‌ధ్యాహ్నం12.50 జ‌రిగి న‌ట్టు సీసీ కెమారాలో రికార్డైన స‌మ‌యం బ‌ట్టి…అదే త్రోవ‌లో వెళ్లిన 13 వాహ‌నాల‌ను చెకింగ్ చేసినా…ఈ ap 39bv 9909 నెంబ‌ర్ గ‌ల‌ ఎర్టికా కార్ తార‌స‌క‌ప‌డ‌క‌పోవ‌డంతో…కారు ఉన్న ప‌రిస‌ర ప్రాంతాల‌ను పూర్తిగా సోదాలు చేసి గాలించామ‌ని..చివ‌ర‌కు కారుకు కుడివైపు బాగా దెబ్బ‌తిన‌డం అదే త‌మ కేసు ప‌రిశోధ‌న‌కు మ‌రింత ఉప‌యోగ‌ప‌డింద‌ని ఎస్ఐ జ‌యంతి తెలిపారు.

దీంతో ఏపీ ఈ చ‌లానా యాప్ ద్వారా….కారు కొనుగోలు చేసిన అడ్ర‌స్..దాంతో పాటు డ్రైవ‌ర్ ను గుర్తించి…ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్నామ‌న్నారు.ఈ మీడియా స‌మావేశంలో భోగాపురం సీఐ శ్రీధ‌ర్ కూడా ఉన్నారు.

Related posts

నెవర్ ఎండింగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ బతికే ఉన్నాడు

Satyam NEWS

వేరుశనగ విత్తనాల పై నోరు విప్పని వ్యవసాయ మంత్రి

Satyam NEWS

తిరుమల ఎక్స్ ప్రెస్ రైల్లో ఆహాకారాలు…!

Bhavani

Leave a Comment