38.2 C
Hyderabad
May 3, 2024 22: 45 PM
Slider జాతీయం

సొంత కూతురిపైనే అఘాయిత్యం చేసిన తండ్రి

#rapecase

దుర్మార్గుడు అంటారో… నీచుడు అంటారో… ఏమంటారో మీ ఇష్టం. అసోంలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. అసోంలోని నాగావ్‌లో ఒక తండ్రి తన సొంత కూతురిపై పదే పదే అత్యాచారం చేశాడు. కచువా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాంగ్‌జాప్‌లో ఈ దారుణం జరిగినట్లు సంఘటన ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది.

తన ఇంట్లోనే 11 సంవత్సరాల కుమార్తెను ఆ దుర్మార్గుడు చెరబట్టాడు. సెప్టెంబరు 20న చివరి అత్యాచార ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నేరం చేసిన తర్వాత నిందితుడైన తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన అంతా విన్న బాలిక తల్లి స్థానికులను సంప్రదించగా, ఎవరూ పట్టించుకోలేదు.

దీంతో సదరు మహిళ సెప్టెంబర్ 27న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదే రోజు అరెస్టు చేశారు. ఇంతకుముందు కూడా తన కూతురిపై భర్త అత్యాచారం చేశాడని, ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేశారని, అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన వాడు మళ్లీ ఇలా చేశాడని బాలిక తల్లి పోలీసులకు తెలిపింది. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరచగా, అక్కడి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Related posts

స్నేహితునికి చేయూతనిచ్చిన పూర్వ విద్యార్ధులు

Satyam NEWS

సంగీత క‌ళా న‌గ‌రంలో ల‌తామంగేష్క‌ర్ అవార్డు గ్ర‌హీత‌చే హిందుస్థానీ క‌చేరీ

Satyam NEWS

నూతన సంవత్సరంలో అందరికి అందుబాటులో హాక్ ఐ యాప్

Satyam NEWS

Leave a Comment