40.2 C
Hyderabad
April 26, 2024 13: 38 PM
Slider నెల్లూరు

గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ఎం.వి రావు పౌండేషన్ లక్ష్యం

vaakadu

గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమ లక్ష్యంగా ఎం వి రావు ఫౌండేషన్ నిర్వాహకులు పనిచేస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి వి రమణ కుమార్ అన్నారు. శుక్రవారం వాకాడు మండలం బాల్రెడ్డి పాలెం పంచాయితీ పరిధిలోని బండ్ల దిబ్బ దళితవాద మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు 12వ వర్ధంతిని పురస్కరించుకొని కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన ఎం వి రావు ఫౌండేషన్, శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు ఆయుష్ వైద్యశాల సౌజన్యంతో ఉచిత ఆయుర్వేద, హోమియో వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్ని రమణ కుమార్ ప్రారంభించారు ఈ శిబిరంలో ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ శేఖర్ డాక్టర్ వి  సుబ్రహ్మణ్యం హాజరై శిబిరానికి హజరైన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతిరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా విద్యా వైద్య రంగాల పై దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి వ్యాధులు సోకకుండా వారికి ముందస్తు జాగ్రత్త చర్యగా వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు మందులు పంపిణీ చేస్తున్న ఎం వి రావు పౌండేషన్ నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. ఆయుర్వేదిక్ మరియు హోమియో వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి వారికి అవసరమైన ఆయుర్వేదిక్ హోమియో మందులు పంపిణీ చేశారు అదేవిధంగా బాల్ రెడ్డి పాలెం పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల  అంగన్వాడి విద్యార్థులకు సిబ్బందికి విష జ్వరాలు సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా వాడే హోమియో మందులను బాలరెడ్డి పాలెం పాలెం గ్రామాలలోని పాఠశాలల విద్యార్థులకు ఆయా పాఠశాలల సిబ్బందికి పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎం. వి రావ్ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన క్రిష్ణ ఎం విజయలక్ష్మి ప్రధానోపాధ్యాయులు పట్టాభిపురం భాస్కర్ రావు మస్తానయ్య సంపూర్ణ అమ్మ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’ ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన వనపర్తి జిల్లా ఎస్పీ

Satyam NEWS

డేంజర్ బెల్స్: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా

Satyam NEWS

Leave a Comment