జగిత్యాల జిల్లా,మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారాం గ్రామ శివారులో మంగళవారం నాడు పేకాట ఆడుతున్నారనే సమాచారo మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఆరిఫ్అలీఖాన్ తన సిబ్బందితో కలిసి దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడుల సందర్భంగా పేకాట రాయుల వద్ద నుండి రూ.10,220 నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని మల్యాల పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సిఐ అరిఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ పేకాట,అక్రమంగా మద్యం,గుట్కా వ్యాపారం,చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే డయల్100,సంబందిత పోలీస్ స్టేషన్ కు,టాస్క్ ఫోర్స్ నెంబర్ 95504 87771కు సమాచారం ఇవ్వాలన్నారు