27.7 C
Hyderabad
May 4, 2024 10: 47 AM
Slider గుంటూరు

యూనియన్ బ్యాంకు లో బంగారం మాయం

#Union Bank

ఉన్న కొద్దోగొప్పో బం గారం బ్యాంకులో భద్రంగా ఉంది. లే.. ఇంక అమ్మాయి పెళ్లికి భయ పడాల్సిన పనిలేదు. ఆలి మెడలో తళతళ మెరవాల్సిన తాళిబొట్టు ఎండిన మొక్కలకు ఎరువు వేయడానికి బ్యాంకులోకి వెళ్లినా ఆ అన్నదాత మోములో చిరునవ్వు మారలేదు. ఎందుకం భద్రం. అది ఓ నమ్మకం. అయితే కొందరు ఈ నమ్మకానికి నిప్పు రాజేస్తున్నారు. అన్నదాతల సొమ్ముకు ఎసరు పెడుతున్నారు. బ్యాంకులకు మచ్చ తీసుకొస్తు ఉన్నారు.

సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో తాజాగా జరిగిన ఈ ఘటన రైతన్నలను కలవరానికి గురిచేస్తోంది. పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో ఆంధ్రాబ్యాంక్ ఇటీ వల యూనియన్ బ్యాంకుగా మారింది. ఈ బ్యాంకులో సుమారు వేల సంఖ్యలో ఖాతాలు ఉన్నాయి.

ఈ గ్రామంలో రైతులు అధిక సంఖ్యలో బ్యాంకులో బం గారం తాకట్టు పెట్టి వ్యవసాయానికి రుణం తీసుకుంటారు. అయితే తాజాగా ఈ బ్యాంకులో పనిచేసే గోల్డ్ అప్రయిజర్ ఇమ్మిడిశెట్టి .సంపత్ కుమార్ బంగారాన్ని భద్రపరచాల్సింది పోయి మాయం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బ్యాంకు సిబ్బంది ఉలిక్కిపడ్డారు. మొత్తం 43 బ్యాగ్లలో రూ.1.70 కోట్ల విలువ చేసే బంగారాన్ని మాయం చేశారు. దీనిపై బ్యాంకు ఉన్నతాధికా రులు స్పందించి బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న బ్రాంచ్ మేనేజర్ రాంబాబు నాయక్, అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్పై సస్పెన్షన్ వేటు వేశారు.

బంగారాన్ని తిరిగి తీసుకురావాలని గోల్డ్ అప్రయిజర్ సంపత్ కుమార్కు మూడు రోజులు సమయం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన రైతులు ఒకపక్క ఆందోళన వ్యక్తం చేస్తుండగా మరో వైపు స్పెన్షన్కు గురైన మేనేజర్ తక్షణమే బంగారం తీసుకురాక పోతే ఆత్మహత్య చేసుకుంటానని గోల్డ్ అప్రయిజర్తో మొర పెట్టుకుంటున్నాడు. దీనిపై ఓ జిల్లా అధికారిని వివరణ కోరగా జరిగినది వాస్తవమేనని పేరు రాయ డానికి ఇష్టపడని ఆయన ధ్రువీకరించాడు.

Related posts

ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు

Murali Krishna

ఫ్రేమోన్మాధి ఘాతుకం

Murali Krishna

కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత్ కు విముక్తి

Satyam NEWS

Leave a Comment