30.7 C
Hyderabad
May 5, 2024 03: 23 AM
Slider రంగారెడ్డి

యాదవులు, కుర్మల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

#harishrao

యాదవులు కురుమలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి  కేటీఆర్ , ఆర్థిక, వైద్య శాఖ  మంత్రి హరీష్ రావు అన్నారు.

బుధవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని బి ఎం ఆర్ సార్థ కన్వెన్షన్ హాల్ లో జరిగిన యాదవ కుర్మల ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ & మంత్రి  కేటీఆర్ ,మంత్రి హరీష్ రావు లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాపరంగా యాదవ కురుమలు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కు ముందు యాదవ కురుమలను కేవలం ఓటు బ్యాంకు లాగానే చూసారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యాదవులు కురుమలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ , ఎమ్మేల్యేలు అంజయ్య యాదవ్ ,మల్లయ్య యాదవ్ ,భగత్ యాదవ్ ,జైపాల్ యాదవ్ , ఎంపీ లింగయ్య యాదవ్ ,ఎమ్మెల్సీ యెగ్గే మల్లేష్ కురుమ ,చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ బాల రాజ్ యాదవ్ , యాదవ నాయకులు,మహిళ సోదరీమణులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

బాణసంచా గోడౌన్‌ ప్రమాదంలో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా

Bhavani

హుజూర్ నగర్ లో ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ

Satyam NEWS

గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 4 వ రోజు కొనసాగింపు

Satyam NEWS

Leave a Comment