26.7 C
Hyderabad
May 15, 2024 07: 23 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ

#hujurnagar

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ, మండల లింగగిరి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ అనంతరం జరిగిన సమావేశంలో మండల ఆరోగ్య విస్తరణాధికారి గజగంటి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు 2030 సంవత్సరం నాటికి మలేరియా నిర్మూలనకు అందరం కలిసి పని చేయాలని మలేరియా వ్యాధి భారాన్ని తగ్గించడానికి నూతన ఆవిష్కరణలను ఉపయోగించుకోవాలని తెలిపారు.

నీటి నిల్వ ఉన్న ప్రదేశాలలో దోమలు పెరుగుతాయని,అటువంటి ప్రదేశాలను గుర్తించి తొలగించాలని,ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని,ఎయిర్ కూలర్లో ఎప్పటి కప్పుడు నీటిని మార్చుకోవాలని,దోమ తెరలు ఉపయోగించడం ద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టవచ్చునని అన్నారు.

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఉదయగిరి శ్రీనివాస్, పి.సావిత్రి,సూర్యాపేట జిల్లా అడిసినల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్

కోటచలం,జిల్లా మలేరియా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సాహితీ చేతుల మీదుగా సోమవారం ఉత్తమ ప్రశంసా పత్రాలను సూర్యాపేట జిల్లా కేంద్రంలో అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ ఎన్  నూర్జహాన్ బేగం,ఇందిరాల రామకృష్ణ, ఆరోగ్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

డివిజన్ సమగ్ర అభివృద్ధికి సీపీఎం అభ్యర్థి ప్రణాళిక విడుదల

Satyam NEWS

న్యాయవ్యవస్థతో ఘర్షణ నివారణకు మోదీ చర్యలు

Bhavani

సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం తగదు

Bhavani

Leave a Comment