29.7 C
Hyderabad
May 3, 2024 06: 47 AM
Slider మహబూబ్ నగర్

గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 4 వ రోజు కొనసాగింపు

జోగులాంబ గద్వాల లోని గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా ఆదివారంతో నాల్గవ రోజుకు చేరుకుంది. గద్వాల ఎంపీడీఓ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్స్ జేఏసీ నిరవధిక సమ్మెకు హలో కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు బీచుపల్లి, ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ మాట్లాడుతూ ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన నిరవధిక సమ్మెను సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కొనసాగిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే పిఆర్సి 30% పెంచాలని పిఆర్సి మినిమం వేస్ ప్రకారం 19000 జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకులకు 15600. పంపు ఎలక్ట్రీషియన్,ఆపరేటర్లు, డ్రైవర్లు, కారోబార్ బిల్ కలెక్టర్లుకు 19500 ,కారోబాల్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 51 ను సవరించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పాత కేటగిరీలన్ని యధావిధిగా కొనసాగించాలని కోరారు.విధినిర్వహణలో మరణించిన పంచాయతీ కార్మికునికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలని, పోస్ట్ ఆఫీస్ బీమా పథకం ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మరణించిన కార్మిక కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీ కార్మికునికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, ప్రమాద బీమా, గ్రాట్యూటీ, గుర్తింపు కార్డు ఇవ్వాలని, దహన సంస్కారాలకు రూ .30 వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని, వారాంతపు సెలవులు, పండుగ సెలవులు జాతీయ ఆర్జిత సెలవుల దినాలను అమలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి. గ్రామపంచాయ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలను వర్తించే విదంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై వేధింపులు అక్రమ తొలిగింపులు వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. జూలై ఆరవ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమ్మెలో జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బీచ్పల్లి, ప్రధాన కార్యదర్శి జమ్మిచెడు కార్తిక్, మండల అధ్యక్షులు రాఘవేంద్ర, జిల్లా కోశాధికారి గోవిందు, సభ్యులు రవి, చిన్నయ్య, నందన్న, శంకర్, కురుమన్న, సత్యన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

వకీల్ సాబ్ ను చూసి భయపడుతున్న సిఎం సాబ్

Satyam NEWS

నిర్మాణదశలో కూలిన వేములవాడ రెండో బ్రిడ్జి

Satyam NEWS

నిరాశ్రయులైన రోగులకు అండగా నిలిచిన కడప డి.ఎస్.పి

Satyam NEWS

Leave a Comment