26.7 C
Hyderabad
May 16, 2024 09: 16 AM
Slider మహబూబ్ నగర్

దళితుల భూములు గుంజుకుంటున్న ప్రభుత్వం

#malachaitanyasamithi

మహబూబ్ నగర్ ..కల్వకుర్తి ..నంద్యాల బైపాస్ రోడ్డు పేరుతో నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రానికి చెందిన దాదాపు 30 మంది చిన్న సన్నకారురైతులైన దళితుల భూములను గుంజు కోవడం అన్యాయం అని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు విమర్శించారు.

తాడూరు మండల కేంద్రానికి చెందిన చిన్న సన్నకారు రైతులైన 30 మంది దళిత కుటుంబాలు 70 సంవత్సరాలుగా ఒక్కొక్కరికి అర్థ ఎకరా ఒక్క ఎకరా రెండు ఎకరాల లోపు పట్టా కలిగి ఉన్నారని ఆయన అన్నారు. పట్టా భూములు కలిగిన దళిత రైతులు వ్యవసాయం చేస్తూ తమ జీవనం కొనసాగిస్తూ కాలం వెళ్లదీస్తున్నారని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి నంద్యాల బైపాస్ రోడ్డు పేరుతో దళితుల భూములను గుంజుకో ని వారి కుటుంబాలను రోడ్డున పడేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాలల చైతన్య సమితి హెచ్చరిస్తోంది.

దళిత చిన్న సన్నకారు రైతుల ఆవేదనను అర్థం చేసుకొని కల్వకుర్తి నంద్యాల బైపాస్ రోడ్ డిజైన్ ను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. లేనియెడల దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత రైతుల కు అన్యాయం జరగకుండా వారి భూములలో బైపాస్ రోడ్డు వేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఏకమై రైతుల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మాలల చైతన్య సమితిరాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Related posts

పిచ్చి ముదిరింది: స్వాతంత్య్ర యోధుల పేరు కూడా హాంఫట్

Satyam NEWS

బిగ్‌బాస్‌3 నుండి శిల్పచక్రవర్తి ఔట్‌ ?!

Satyam NEWS

వై థిస్ అరెస్ట్ :మా నాయకులు చేసిన తప్పేంటి ?

Satyam NEWS

Leave a Comment